పరిహారం కోసం రైతన్న సాహసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం రైతన్న సాహసం

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

సాక్షి,బళ్లారి/రాయచూరు రూరల్‌: తన పొలంలో నిర్మిస్తున్న హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌కు సంబంధించి మూడు నెలలుగా ఎలాంటి పరిహారం ఇవ్వలేదని మండిపడుతూ ఓ రైతు పరిహారం ఇచ్చే వరకు హైటెన్షన్‌ టవర్‌ నుంచి కిందకు దిగనని మొండికేశారు. కొప్పళ జిల్లా కుష్టగి తాలూకా హిరేనందిహాళ గ్రామం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమంతప్ప అనే రైతు తొలుత పరిహారం ఇవ్వకుంటే నిర్మాణ పనులు ఆపేయాలని సిబ్బందిని హెచ్చరించారు. తన మాటను పెడచెవిన పెట్టడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రైతు విద్యుత్‌ టవర్‌పైకెక్కి కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం సమాచారం అందుకున్న కంపెనీ అధికారులు, పోలీసులు వచ్చి రైతుతో చర్చించి నచ్చజెప్పారు. అన్ని విధాలుగా భరోసా ఇచ్చిన తర్వాత టవర్‌ పైనుంచి ఎట్టకేలకు రైతు కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

హైటెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ పైకెక్కిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement