వాహనాల రూపు మారిస్తే..
● అలాగే వాహనాలకు ఇష్టానుసారం కొత్త ఉపకరణాలను బిగించడం, మార్పులు చేయడం కూడా నిషిద్ధం. పట్టుబడితే వడ్డన తప్పదు.
● తరచూ నిబంధనలను ఉల్లంఘించేవారి కట్టడికి కొత్త వ్యూహాలు అవలంబిస్తారు. కేంద్ర ప్రభుత్వ వాహన వెబ్‌సైట్‌లో వారి చలానాల వివరాలను నమోదు చేస్తారు.
● మొదట బెంగళూరులో కొత్త నిబంధనలను అమలు చేస్తారు. తరువాత రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సంస్కరణలపై దృష్టి సారించింది. ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం హాఫ్ హెల్మెట్ వాడడాన్ని ప్రభుత్వం గతంలోనే నిషేధించింది. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి శిరస్త్రాణాల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హాఫ్ హెల్మెట్లను ధరించరాదని మరోసారి భారీ కార్యాచరణను ప్రారంభించనుంది.
శిక్ష ఏమిటీ?
వాహనదారులు కచ్చితంగా బీఐఎస్, ఐఎస్‌ఐ ప్రమాణాలతో కూడిన పూర్తి హెల్మెట్లు ధరించాలని సూచించింది. హాఫ్ హెల్మెట్ ధరించే వాహనదారులకు రూ.500 జరిమానా విధిస్తారు. వెనుక కూర్చున్నవారు ధరించినా ఇదే జరిమానా తప్పదు. మరోసారి పట్టుబడితే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు.
డ్రైవింగ్‌లో మొబైల్.. రూ.1500 నుంచి 5 వేలు
బైక్ లేదా కారు డ్రైవింగ్ సమయంలో మొబైల్‌ఫోన్ వినియోగిస్తే రూ.1,500 నుంచి రూ.5 వేలు జరిమానా
సీట్‌బెల్ట్ ధరించని కారు డ్రైవర్లు, ముందు కూర్చున్న ప్రయాణికులకు రూ.500 నుంచి రూ.1000 జరిమానా
ట్రిపుల్ రైడింగ్‌కు, సిగ్నల్‌జంప్ చేస్తే రూ.500 నుంచి 1,000 జరిమానా
మద్య తాగి డ్రైవింగ్ చేసేవారికి మొదటిసారి రూ.10 వేల చలానా, లేదా 6 నెలలు జైలుశిక్ష
డ్రైవింగ్ లైసెన్సు లేకుండా, గడువు ముగిసినా వాహనం నడిపితే రూ.1000 నుంచి రూ.5 వేల జరిమానా
అతివేగానికి రూ.1000 నుంచి రూ.2 వేలు జరిమానా
మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు రూ.25 వేల జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు.
ట్రాఫిక్ జరిమానాలను రెట్టింపు
చేయనున్న ప్రభుత్వం
రద్దీ, ప్రమాదాల నివారణ కోసం
కఠిన చర్యలు
మేలుకోకుంటే వాహనదారులకు
బాదుడే బాదుడు
ఓ సాధారణ బైకిస్టుకు నెలలో రెండు మూడు సార్లు ట్రాఫిక్ జరిమానాలు పడితే ఆదాయం దానికే సరిపోతుంది. ట్రాఫిక్ కూడళ్లలోని కెమెరాలు ఇట్టే పసిగట్టి బుక్ చేస్తాయి. ఇప్పటికే చలాన్లు భరించలేనంతగా ఉంటున్నాయని బాధపడే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త జరిమానాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాయి. ఆ స్థాయిలో చలానాల విధింపు ఉండొచ్చని తెలుస్తోంది. సక్రమంగా వాహనం నడపడమే శ్రేయస్కరం.


