బాంబులా పేలిన విద్యుత్‌ బాక్సు | - | Sakshi
Sakshi News home page

బాంబులా పేలిన విద్యుత్‌ బాక్సు

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అమెజాన్‌ ఆఫీసు గేటు ముందు ట్రాన్స్‌ఫార్మర్‌ బాక్స్‌ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాగలూరు క్రాస్‌లో ఉన్న ఆఫీసు 3వ గేట్‌ వద్ద బాంబు మాదిరిగా అది విస్ఫోటం చెందింది. పెద్దగా అగ్ని, నల్లని పొగ వ్యాపించాయి. ఆ పేలుడు ధాటికి ఇద్దరు యువకుడు ఎగిరి పడ్డారు, వారి ముఖం, ఎదకు కాలిన గాయాలయ్యాయి. ముక్కలు తగిలి సమీపంలో ఉన్న కొందరు పాదచారులు గాయపడ్డారు. పేలుడు దృశ్యాలు సమీపంలో ఓ కారు డ్యాష్‌ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విస్ఫోటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎలా జరిగిందో చాలాసేపు గుర్తించలేకపోయారు. యలహంక ఉపనగర పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement