కరువు నిర్వహణలో లోపాలు రాకూడదు | - | Sakshi
Sakshi News home page

కరువు నిర్వహణలో లోపాలు రాకూడదు

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో కరువు నిర్వహణ పనుల్లో అధికారులు లోపాలు జరగకుండా తాగునీరు, వ్యవసాయం, నీటిపారుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఇంచార్జి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌ సింగ్‌ అధికారులను అదేశించారు. బుధవారం రాయచూరు జిల్లాధికారి కార్యాలయంలో కరువు నివారణపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. పశువులకు గ్రాసం కొరత రాకూడదని, వ్యవసాయ కూలీలకు, కార్మికులకు వీబీజీ రాంజీ పథకంలో వలసలు వెళ్లకుండా చూడాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువలో నీటి సామర్థ్యాన్ని తెలిపే గేజ్‌ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చూడాలన్నారు. ఐదు తాలూకాలను కరువు ప్రాంతాలుగా సర్కార్‌ ప్రకటించిందన్నారు. శాసన సభ్యులు బసన గౌడ, కరెమ్మ, హంపన గౌడ, తుర్విహాళ్‌ బసనగౌడ, ఎమ్మెల్సీ బోసురాజు, జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, నగర పాలక కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత, వ్యవసాయ శాఖాధికారి హుసేన్‌లున్నారు.

తాగునీరు, వ్యవసాయం, నీటిపారుదలకు ప్రాధాన్యత ఇవ్వండి

జిల్లా ఇంచార్జి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement