బాల్య వివాహాలను అరికడదాం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను అరికడదాం

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

హొసపేటె: విజయనగర జిల్లా హూవినహడగలి తాలూకా కే.అయ్యనహళ్లి గ్రామంలో బాలమేళాను మంగళవారం నిర్వహించారు. బాలికల విద్య, భద్రత, ఆరోగ్యం, పోషణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన బేటీ బచావో–బేటీ పడావో పోషణ మాసోత్సవంలో భాగంగా బాలికల సంక్షేమం, బాల్య వివాహాల నివారణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమానికి డిప్యూటీ డైరెక్టర్‌ గంగప్ప అధ్యక్షత వహించి మాట్లాడుతూ బాలికలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కుటుంబంతో పాటు సమాజం మొత్తానిది అని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించడంతో పాటు బాల్య వివాహాలను పూర్తిగా నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జిల్లా నరేటర్‌ ముదుకప్ప, పీఓడీ మహమ్మద్‌ రఫిక్‌, మహిళా సూపర్‌వైజర్‌ శోభ, జిల్లా మిషన్‌ శక్తి కో–ఆర్డినేటర్‌ విద్య, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ప్రతినిధులు శోభ, అన్నపూర్ణ, శివరాజ్‌, జయలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ మహిళలు, పిల్లలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement