హుబ్లీ: దేవుడిపై విశ్వాసం ఉంచితే అన్ని కష్టాలను ఎదుర్కొనే శక్తియుక్తులను ఆ దేవుడే ప్రసాదిస్తాడని సింధనూరు గెస్సేమనె ప్రార్థన మందిరం పాస్టర్ హరీష్ తెలిపారు. సింధనూరులో పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్ అనే ప్రత్యేక కార్యక్రమంలో హరీష్ పాల్గొని బైబిల్‌లోని వాక్యాలను ఉదహరిస్తూ అందరి క్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముఖ్యంగా పేదలు, ఆకలితో ఉన్న వారికి వివిధ సమస్యలు, రోగాలతో కొట్టుమిట్టాడే వారిని తమ శక్తి మేర ఇలాంటి వారికి ఎవరైతే ఆదుకొని ఆదరిస్తారో అదే నిజమైన దేవుడి ప్రేమ అన్నారు. ఏసుప్రభువు తమ శిష్యులకు బోధించిన ప్రతి వాక్యంలోనూ దేవుడి ప్రేమ నిజమైన పేదలు, నిర్భాగ్యులు, రోగులు కంట సంతృప్తి చూడటమే కరుణామయుడి బోధనల సారాంశం అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బోధకులు, దైవజనులు పాల్గొని అందరి మేలు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎస్‌ఎఫ్ ఫెలోషిప్ పొందినందుకు పాస్టర్ హరీష్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


