కొబ్బరి క్వింటాలు రూ.32 వేలు | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి క్వింటాలు రూ.32 వేలు

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

తుమకూరు: జిల్లాలోని కొబ్బరితోటల రైతులకు తీయని వార్త లభించింది. గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, టెంకాయల కొత్త ధర రూ.32 వేలు దాటడంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. తిపటూరు ఎమ్మెల్యే కె. షడక్షరి, వ్యవసాయ మార్కెటింగ్‌ బోర్డు ఎండీ శివానంద్‌ కపాషి మాట్లాడుతూ ప్రధానంగా సర్దుబాటు టెండర్‌ను రద్దు చేయడం వల్ల కొబ్బరి మార్కెట్‌లో మంచి ధరలు లభించడానికి కారణమైందని తెలిపారు. ఇప్పుడు కొబ్బరి ధర క్వింటాల్‌కు రూ.32,218కి చేరడంతో, రాబోయే రోజుల్లో ఇంకా పెరగవచ్చని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రతికూల వాతావరణం వల్ల కొబ్బరి తోటల్లో దిగుబడి తగ్గిపోయింది. ఒకప్పుడు 10 వేల కాయలు దిగుబడి ఉన్న తోటలో ఇప్పుడు 1,500 నుంచి 2,000 కాయల దిగుబడిని మాత్రమే వస్తోందని రైతులు తెలిపారు.

తుమకూరులో రికార్డు ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement