దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది | - | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

సాక్షి,బళ్లారి: దేశ రాజకీయ చరిత్రలో 1980 ఏప్రిల్‌ 6న ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలికిందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం బీజేపీ సంస్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ముందుగా తన స్వగృహంపై బీజేపీ జెండాను ఎగరవేసిన అనంతరం, నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యఽక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా, ఎమ్మెల్సీ వై.ఎం.సతీష్‌, మాజీ ఎమ్మెల్సీ మృత్యుంజయ జినగ తదితరులతో కలిసి భారతమాత, శ్యాంప్రసాద్‌ ముఖర్జి, దీనదయాళ్‌ ఉపాధ్కాయ చిత్ర పటాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేతలందరితో కలిసి బీజేపీ జెండాను ఎగరవేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కే.ఎస్‌ దివాకర్‌, నాయకులు వెంకటరమణ, గురులింగనగౌడ తదితరులు పాల్గొన్నారు.

రాయచూరులో..

రాయచూరు రూరల్‌: యాదగిరి, రాయచూరుల్లో బీజేపీ సంస్థాపన దినోత్సవాన్ని ఆయా జిల్లా బీజేపీ కార్యవర్గం చేపట్టింది. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.శంకరప్ప, జిల్లాధ్యక్షుడు వీరనగౌడ, యాదగిరిలో నగరసభ మాజీ అధ్యక్షురాలు లలిత తదితరులు బీజేపీ 44వ సంస్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకుని పండిత్‌ దీన్‌ దయాళ్‌, శివ ప్రసాద్‌ ముఖర్జి, భారత మాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో గోవిందు, రవీంద్ర, యల్లప్ప, నరసింహులు, గోపి, సుభాష్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement