ఆటో డ్రైవర్లకు ఆరో గ్యారెంటీ ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్లకు ఆరో గ్యారెంటీ ఇవ్వండి

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో తమకు ఆరో గ్యారెంటీ ఇవ్వాలని ఆటో డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డీ.కుమారస్వామి పేర్కొన్నారు. శనివారం రాయచూరు జిల్లా సింధనూరు వద్ద హొసళ్లి క్యాంప్‌లో శ్రీకృష్ణ దేవరాయ సైనిక పాఠశాలను ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెలకు రూ.15 వేలు చొప్పున భాగ్యను కల్పించాలని ఆటో డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న నేపథ్యంలో ఇవ్వడానికి ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌లోని నేతలు కేంద్ర సర్కార్‌పై లేని పోని విమర్శలు గుప్పించడం తగదన్నారు. ఆటోలకు విధించిన పన్నులను ఉపసంహరించుకోవాలన్నారు. దేశంలో క్లిష్ట పరిస్థతిలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం, అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. అభివృద్ధి విషయంలో రాష్ట్ర సర్కార్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉందన్నారు. రాయచూరుకు ఎయిమ్స్‌ మంజూరు, నవలి వద్ద బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ఏర్పాటుకు అందరూ ఏకం కావాలన్నారు. తుంగభద్ర డ్యాంలో 30 టీఎంసీల పూడిక పేరుకు పోయినందున నవలి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. సింధనూరులో పరిశ్రమల ఏర్పాటుకు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ సేథ్‌, మాజీ మంత్రి వెంకట్రావ్‌ నాడగౌడ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, శ్రీకృష్ణ దేవరాయ సైనిక పాఠశాల అధ్యక్షుడు వెంకటరావ్‌, నగేష్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement