దొడ్డబళ్లాపురం: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లకు వంట గ్యాస్, ఆటోలకు ఎల్‌పీజీ, సీఎన్‌జీ ఇంధనం దొరక్క తీవ్ర కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ నేడు సోమవారం ఆటో డ్రైవర్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప ఇంటిని ముట్టడించనున్నారు. బెంగళూరులో ఉన్న అన్ని ఆటో యూనియన్‌ల ఆధ్వర్యంలో డ్రైవర్లు ఈ నిరసనలో పాల్గొంటామని తెలిపారు. గ్యాస్ కొరతతో ఉపాధి దూరమైందని, బెంగళూరులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఆటో గ్యాస్ లభించడం లేదని డ్రైవర్లు ఆరోపించారు. బంకుల ముందు ఆటోలు పగలూ రాత్రి కిలోమీటర్ల మేరకు బారులు తీరి నిలబడాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందారు.
నేడు మంత్రి ఇంటి ముట్టడి


