తొక్కిసలాట మృతుల గౌరవార్థం రిజర్వు చేసిన ఖాళీ సీట్లు
స్టేడియం బయట కోలాహలం
బనశంకరి: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)– చైన్నె సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగడంతో సందడి ఏర్పడింది. వేలాదిగా అభిమానులు వచ్చారు, కార్లు, బైక్‌లతో స్టేడియం పరిసర ప్రాంతాలలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఇరు జట్ల అభిమానులు తమ టీంల టీషర్టులు ధరించి వచ్చారు. తొక్కిసలాటలు, గొడవలు వంటివి జరగకుండా పోలీస్ భద్రత కల్పించారు. రెండు అదనపు బ్యాగేజ్ కౌంటర్లు తెరిచారు. బెట్టింగ్ , నకిలీ టికెట్ల దందాను అరికట్టడంపై ఖాకీలు నిఘా పెట్టారు. అభిమానుల కోసం బీఎంటీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. గతంలో తొక్కిసలాటలో చనిపోయిన వారి స్మత్యర్థం సీట్లను రిజర్వు చేసి పూలమాలలు వేసి గౌరవించారు.
బెంగళూరులో ఆర్‌సీబీ మ్యాచ్‌కు అభిమాన సంద్రం


