కారును లారీ ఢీ, ఇద్దరు మృతి
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకా రాంపురం సమీపంలోని రాజాపుర గేటు వద్ద కారు–లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఆదివారం బెంగళూరు నుంచి బళ్లారి వైపు వస్తున్న కారు డీవైడర్‌కు ఢీ కొని ంది. అదే సమయంలో వెనుకనే బళ్లారి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న లారీ వేగంగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఇంజనీర్ రవిచంద్ర (42), డ్రైవర్ కిరణ్ (24) అక్కడే మరణించారు.
తుమకూరు: తుమకూరు జిల్లాలోని శిరా తాలూకాలో మినీ విధాన సౌధ సమీపంలో జాతీయ రహదారి– 48పై ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సును కేఎస్ ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనింది. ఈ ప్రమాద తీవ్రతకు ప్రైవేట్ బస్సులోని ఇద్దరు ప్రయాణికులు మరణించగా, రెండు బస్సుల్లో 35 మంది గాయపడ్డారు. మృతులను హావేరికి చెందిన ప్రవీణ్ కృష్ణప్ప (28), గదగ్‌కు చెందిన సంగీత (16)గా గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 2 బస్సులూ బెంగళూరుకు వస్తున్నాయి. ప్రైవేటు బస్సు హైవేలో హఠాత్తుగా ఒక లేన్ నుంచి మరో లేన్‌లోకి మారింది. అదే సమయంలో వేగంగా వస్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సుకు అడ్డుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రైవేటు బస్సు వెనుక భాగాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో బాగా ధ్వంసమైంది. ఫలితంగా, ప్రైవేట్ బస్సు వెనుక సీట్లలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు గాయాలతో చనిపోయారు. 2 బస్సుల్లోనూ 35 మందికి గాయాలు తగిలాయి. శిర పోలీసులు, స్థానికులు చేరుకుని బాధితులను ఆస్పత్రులకు తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు రెండు వాహనాల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి.
హఠాత్తుగా లేన్ మారిన ప్రైవేటు బస్సు
వెనుక నుంచి ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఇద్దరు మృతి, 35 మందికి గాయాలు
తుమకూరు జిల్లాలో దుర్ఘటన


