సాక్షి, బళ్లారి: దావణగెరె దక్షిణ, బాగల్‌కోటె అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం ముమ్మరంగా ప్రచార పర్వం సాగింది. మంగళవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగుస్తుంది. బుధవారం అభ్యర్థులు సందడి లేకుండా ఇంటింటికి వెళ్లి ఓట్లు అర్థించవచ్చు. సోమవారం దావణగెరెలో కాంగ్రెస్ అభ్యర్థి శ్యామనూరు సమర్థ్‌కు మద్దతుగా సీఎం సిద్దరామయ్య ప్రచారం నిర్వహించారు. దావణగెరె వెన్న దోసె ఎంత రుచిగా ఉందో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అద్భుతమైన ఫలితాలు అందించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన వెన్న దోసెను ఆరగించారు.


