హుబ్లీ: ఆఫీసులోనే రూ.6 లక్షలు లంచం తీసుకుంటుండగా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఘటన వాణిజ్య నగరి హుబ్లీలో జరిగింది. భరత్‌కుమార్ హెగ్డే ఆ అధికారి. వివరాలు.. 2019లో 8 టిప్పర్లు కొనుగోలు చేసిన అంకోలావాసి విశ్వజిత్ నాయక్ ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్నారు. అయితే ఇది ట్యాక్స్ చట్టాలకు విరుద్ధమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం 5వ సారి విచారణకు పిలిచారు, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని రండి, అలాగైతే కేసు క్లోజ్ చేస్తామని అధికారి భరత్‌కుమార్ హెగ్డే ఆదేశించారు. ఆ మేరకు ఆఫీసులో రూ. 6 లక్షలు తీసుకుంటూ ఉండగా బెంగళూరు లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్ దేవరాజ్, డీఎస్పీలు మల్లికార్జున చుక్కి, ప్రదీప్‌కుమార్, సీఐ రాజు అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
హుబ్లీలో వాణిజ్య శాఖ అధికారి అరెస్టు


