సేంద్రియ సాగుతో భారీగా పంట దిగుబడి | - | Sakshi
Sakshi News home page

సేంద్రియ సాగుతో భారీగా పంట దిగుబడి

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

రాయచూరు రూరల్‌ : సేంద్రియ వ్యవసాయానికి కొత్త దిశఽను కల్పించిన హరీష్‌ మహారాజ్‌ అనే ప్రగతిశీల రైతు ఆదర్శ విజయగాధతో కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా కిల్లారహట్టి తాండాలో రైతులకు ఆదర్శంగా నిలిచారు. రైతుతన పొలంలో పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయాన్ని అవలంభించారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు వినియోగించకుండా స్వయంగా వివిధ రకాలైన సేంద్రియ ఎరువులను తయారు చేసి తన పొలంలో వినియోగిస్తున్నారు. జీవామృతాన్ని తయారు చేసి పంటలకు తప్పకుండా వాడుతున్నారు. జీవామృతం, ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లం, సెనగ పిండి, భూమిలోని సూక్ష్మ జీవులతో తయారు చేస్తారు. దీంతో భూసారాన్ని మెరుగు పరుస్తుందని రైతు తెలిపారు. మన జీవామృతం, పంచ గవ్య ఇతర సేంద్రియ ఎరువులను పంటలకు వివిధ దశల్లో వినియోగిస్తూ పంట దిగుబడి సాధించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారాన్ని సంరక్షించడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి వీలుంటుందన్నారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గడమే కాకుండా రైతులు అధిక లాభాలు గడిస్తారని యువ రైతు తెలిపారు. కంది, సజ్జ తదితర పంటలు 13 ఎకరాల్లో వేశామన్నారు. 10 ఎకరాల్లో కంది 40 బస్తాలు, ఐదు ఎకరాల్లో 30 బస్తాలు పండించినట్లు తెలిపారు.

కిల్లారహట్టి తాండా ఆదర్శ రైతు హరీష్‌ మహారాజ్‌ విజయగాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement