గాలితో మంచినీటి ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

గాలితో మంచినీటి ఉత్పత్తి

Dec 2 2025 7:32 AM | Updated on Dec 2 2025 7:32 AM

గాలిత

గాలితో మంచినీటి ఉత్పత్తి

యంత్రానికి విద్యుత్‌ సరఫరా కోసం అమర్చిన సోలార్‌ ప్యానల్‌

దావణగెరెలోని బీఐఈటీ కళాశాల ప్రధాన ద్వారం

గాలిని బిగబట్టి నీటి ఉత్పత్తి చేసే స్మార్ట్‌ అట్మాస్పియర్‌ సిస్టం

హుబ్లీ: గాలిని బిగబట్టడం ద్వారా నీటిని సేకరించే వినూత్న ప్రత్యేక యంత్ర పరికరాన్ని దావణగెరెలోని బాపూజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(బీఐఈటీ) సంస్థ కళాశాలకు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైనింగ్‌ విభాగం విద్యార్థులు కనుగొన్నారు. ఇది రాష్ట్రంలో అరుదైన ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. ఈ నీరు తాగడానికి చాలా బాగుండటంతో ఈ ఆవిష్కరఫ విజయవంతమైందని చెబుతున్నారు. నీటిని సేకరించే యంత్రాన్ని ఆ కళాశాల తొలి అంతస్తులో సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దడంలో విద్యార్థులు, సంబంధిత సిబ్బంది, ఆధ్యాపక బృందంతో పాటు ప్రొఫెసర్ల పాత్ర కీలకం అని చెబుతన్నారు. గాలి నుంచి సేకరించిన ఈ నీటిని శుద్ధీకరించకుండా సేవించవచ్చు. ఈ యంత్ర పరికరం తయారీకి మూడు నెలలు పట్టింది. ఏడారి, అటవీ ప్రాంతంలో ఈ పరికరం ఎంతో ప్రయోజనకారి కానుంది. ఉత్పత్తి చేసే నీటిలో మినరల్స్‌ ఉండటంతో సేవించడానికి యోగ్యమైనవని ప్రొఫెసర్లు, విద్యార్థులు తెలిపారు.

యంత్రం పేరు స్మార్ట్‌ అట్మాస్పియర్‌ సిస్టం

ఈ యంత్రం పేరు స్మార్ట్‌ అట్మాస్పియర్‌ సిస్టం. ఇందులో మూడు ఫ్యాన్లు తిరుగుతుంటాయి. ఎత్తైన కట్టడం పైనుంచి వచ్చే తీవ్ర గాలులను ఈ సిస్టంలో సేకరిస్తారు. విద్యుత్‌ సరఫరా కోసం సోలార్‌ను అమర్చారు. ఈ నీటిని రక్షిత మంచి నీటిగా గుర్తించినట్లు నివేదిక తేటతెల్లం చేసింది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైనింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇలా వివరించారు. ప్రస్తుతం స్వల్ప ప్రమాణంలో ప్రయోగాత్మకంగా వస్తువులను వాడాం. దీంతో నీరు తక్కువ ప్రమాణంలో సేకరణ అవుతోంది. దీన్ని పెద్ద ప్రమాణంలో చేయవచ్చు. ఈ నీటిని పరీక్షకు పంపాం. దీని ద్వారా నీరు పరిశుద్ధమైనదని నివేదిక వచ్చింది. ఈ విషయంలో పరిశ్రమల యజమానుల మద్దతు కావాలి. తీవ్రంగా గాలి వీచే ప్రాంతంలో అధిక నీటిని సేకరించవచ్చన్నారు. గాలి నుంచి నీటి సేకరణకు వాడే వస్తువులు తక్కువ ధరకే లభిస్తే ఇక ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇకపై నీటి సమస్య పరిష్కారం

విద్యార్థుల పరిశోధనలకు ఫలితం దక్కాలంటే విరివిగా పరిశ్రమలు తరలి రావాలని ఇక్కడి ప్రొఫెసర్లు అభిప్రాయ పడ్డారు. రోజుకు 8–10 లీటర్ల నీరు ఉత్పత్తి అవుతుందని ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. గాలిలో తేమశాతం ఉండే ఉంటుంది. అటవీ ప్రాంతాలు, ఎడారుల్లో నీరు లభించక పశుపక్షాదులు, జంతువులు చనిపోతాయి. దీంతో గాలిలో నీటిని ఎందుకు ఉపయోగించరాదన్న జిజ్ఞాసతో ఈ ప్రాజెక్ట్‌ని చేపట్టాం. ఇంతకు ముందు హైడ్రో ప్యానల్స్‌ ద్వారా తయారు చేయాలనుకున్నాం. అయితే ఖర్చు ఎక్కువగా అవుతుండటం వల్ల అందుకు బదులుగా సోలార్‌ ప్యానల్‌, కండెన్సర్‌, బ్లోవర్‌, హీటర్లను వాడి గాలిలో నీటిని బిగబట్టి ఈ క్రమంలో నీటిని పరివర్తన చేశామని ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. విద్యార్థి ఽశశాంక్‌ మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారం కోసం ఈ ప్రాజెక్ట్‌ చేపట్టాలన్న సంకల్పంతో ఇలాంటి ఆలోచన(ఐడియా) తట్టింది. దీన్ని సిద్ధం చేయడానికి 2, 3 నెలలు కష్టపడ్డామన్నారు. ప్రస్తుతం తగిన ఫలితం దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. హీట్‌వేవ్‌ గాలుల ద్వారా నీటిని ఉత్పత్తి చేస్తున్నాం. దీనికి 2, 3 వ్యాట్ల విద్యుత్‌ అవసరం అవుతుందన్నారు. అయితే మేం సోలార్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు మరో విద్యార్థి ప్రాజెక్ట్‌ గురించి తెలిపారు.

వినూత్నంగా రోజుకు 8 నుంచి

10 లీటర్ల నీరు తయారీ

దావణగెరె బీఐఈటీ సంస్థ విద్యార్థుల సరికొత్త ఆవిష్కరణ

గాలితో మంచినీటి ఉత్పత్తి 1
1/3

గాలితో మంచినీటి ఉత్పత్తి

గాలితో మంచినీటి ఉత్పత్తి 2
2/3

గాలితో మంచినీటి ఉత్పత్తి

గాలితో మంచినీటి ఉత్పత్తి 3
3/3

గాలితో మంచినీటి ఉత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement