దాసవరేణ్య భక్త కనకదాస | - | Sakshi
Sakshi News home page

దాసవరేణ్య భక్త కనకదాస

Nov 9 2025 7:19 AM | Updated on Nov 9 2025 7:19 AM

దాసవర

దాసవరేణ్య భక్త కనకదాస

సాక్షి,బళ్లారి: నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా భక్త కనకదాస జయంతిని అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శనివారం యుగపురుషుడు, కారణ జన్ముడైన భక్త కనకదాస జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో ఘనంగా భక్త కనకదాస జయంతిని నిర్వహించారు. నగరంలోని కుమారస్వామి ఆలయ సమీపంలోని కనకదాస విగ్రహానికి నేతలు, కురుబ సమాజ ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు పూలమాలలను సమర్పించి పూజలు చేశారు. అనంతరం నగరంలో ఊరేగింపు నిర్వహించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మాట్లాడుతూ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడినే ప్రసన్నం చేసుకున్న మహాపుణ్య పురుషుడు శ్రీభక్త కనకదాస అని కొనియాడారు. హాలుమత(కురుబ) సమాజానికి చెందిన వారు ఎంతో మృదుస్వభావులని కొనియాడారు. భక్త కనకదాస భక్తి, సంగొళ్లి రాయణ్ణ ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అన్నారు. జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ భక్త కనకదాస సామాజిక చింతన, సమాజ అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు శ్లాఘనీయం అన్నారు. జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు గాదిలింగనగౌడ మాట్లాడుతూ కనకదాస ఒక వ్యక్తి కాదు, శక్తి అని కొనియాడారు. 1509వ సంవత్సరం హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా బాడ గ్రామంలో బీరప్ప, బచ్చమ్మ దంపతులకు జన్మించిన పుణ్య పురుషుడని అన్నారు. హరిదాస, హరికీర్తనలతో సమాజంలో చైతన్యం తీసుకొచ్చారన్నారు. అంతకు ముందు నగరంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. అదే విధంగా నగరంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించారన్నారు. జేడీఎస్‌ కార్యాలయం, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో విజయనగర శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఇలా జిల్లా వ్యాప్తంగా భక్త కనకదాస జయంతిని అన్ని వర్గాల ప్రజలు కుల మతాలకు అతీతంగా కనకదాసుకు పూజలు నిర్వహించి తమ భక్తిని చాటారు.

రాయచూరులో...

రాయచూరు రూరల్‌: సమాజంలో దాసులలోకెల్ల కనక దాస అత్యుత్తముడని, ఆయన జీవన విధానాన్ని మనం అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల ఽశాఖ మంత్రి బోసురాజు, విధాన పరిషత్‌ సభ్యుడు వసంత కుమార్‌ పేర్కొన్నారు. శనివారం గంజ్‌ సర్కిల్‌ వద్ద నగరసభ, జిల్లాధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, కురుబ సమాజం నేతల ఆధ్వర్యంలో కనకదాస విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు పూజలు చేసి కనకదాస జయంతిని నిర్వహించారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో మానవుడు దుర్మార్గం వైపు వెళ్లకుండా సన్మార్గంలో పయనించాలని దారి చూపిన మహనీయుడన్నారు. స్వార్థం కోసం కనకదాస ఏనాడూ ముందుకు రాలేదన్నారు. సమాజంలో అణగారిపోతున్న వర్గాలను పైకి తేవాలనే సద్దుద్యేశంతో పాటల ద్వారా అందరి దృష్టిని మళ్లించారన్నారు. జిల్లాధికారి నితీ్‌ష్‌, జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, ఎస్పీ పుట్టమాదయ్య, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్‌ సమీర్‌, శాలం, జయన్న, శాంతప్ప, అమరేగౌడ, నరసింహులు, శివమూర్తి, కురుబ సమాజ స్వాగత సమితి అధ్యక్షుడు బసవరాజ్‌, వేణు గోపాల్‌, హన్మంతు పాల్గొన్నారు. లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్‌ మానప్ప, మాన్విలో శాసన సభ్యుడు హంపయ్య నాయక్‌, సింధనూరులో శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి కనకదాస జయంతిలో పాల్గొన్నారు.

చెళ్లకెరెలో...

చెళ్లకెరె రూరల్‌: ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, కుల మతాల కన్నా భక్తి ముఖ్యం, భక్తి మార్గమే భగవంతుడి మార్గమని భక్త కనకదాస చాటి చెప్పారని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన శనివారం స్థానిక తాలూకా కార్యాలయంలో కనకదాస జయంతి సందర్భంగా కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. కనకదాస తన పాటలు, రచనల ద్వారా శ్రీకృష్ణుడి దర్శనం పొందారన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా విలువలను పాటించి సమాజానికి ఆదర్శంగా జీవించాలన్నారు. కనకదాస సర్కిల్‌ నుంచి నెహ్రు సర్కిల్‌ వరకు కనకదాస చిత్రపటాన్ని ఊరేగించారు. ఊరేగింపులో ఎమ్మెల్యే తదితర ప్రముఖులు పాల్గొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌, నగరసభ అధ్యక్షుడు శిల్ప మురళీధర్‌, నగరసభ్యులు ఎన్‌జే.రాఘవేంద్ర, రమేష్‌గౌడ, కవిత బోరమ్మ, ఆర్‌.ప్రసన్నకుమార్‌, కురుబ సమాజ నాయకులు సురేష్‌బాబు, రాజన్న, మల్లేశప్ప, మల్లికార్జున, శివలింగప్ప పాల్గొన్నారు.

కనకదాస సేవలు అమోఘం

హొసపేటె: కనకదాస కన్నడ సాహిత్య రంగానికి చేసిన సేవలు, భక్తిగీతాలు, కీర్తనలు, సామాజిక సంస్కరణలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని విజయనగర జిల్లాధికారి కవిత ఎస్‌.మన్నికేరి తెలిపారు. శనివారం కనకదాస జయంతి సందర్భంగా నగరంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఉన్న కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆమె మాట్లాడారు. ఆయన రచనలు సరళమైన భాషలో లోతైన ఆధ్యాత్మిక భావాలను అందించాయన్నారు. కనకదాస కీర్తనలు నేటికీ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు. ఆయన భక్తి, జ్ఞానం, సమాజ సేవ నేటి తరాలకు స్ఫూర్పినిస్తూనే ఉన్నాయి. కనకదాస జయంతి ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి ఒక ముఖ్యమైన పండుగగా మారిందన్నారు. ఎస్పీ జాహ్నవి, జెడ్పీ సీఈఓ మహమ్మద్‌ నోంగ్జాయ్‌ అక్రమ్‌ షా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ వివేక్‌, తహసీల్దార్‌ శృతి, సమాజ ప్రముఖుడు కురి శివమూర్తి తదితరులు పాల్గొన్నారు.

రాయచూరులో కనకదాస జయంతిలో పాల్గొన్న ప్రముఖులు

బళ్లారిలో కనకదాస ప్రతిమకు పుష్పార్చన చేస్తున్న ప్రముఖులు

కనకదాస అడుగు జాడల్లో నడవాలని నేతల పిలుపు

వాడవాడలా భక్తిశ్రద్ధలతో కనకదాస జయంత్యుత్సవం

దాసవరేణ్య భక్త కనకదాస 1
1/3

దాసవరేణ్య భక్త కనకదాస

దాసవరేణ్య భక్త కనకదాస 2
2/3

దాసవరేణ్య భక్త కనకదాస

దాసవరేణ్య భక్త కనకదాస 3
3/3

దాసవరేణ్య భక్త కనకదాస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement