పీడీఓగా ఐఏఎ్‌స్ అధికారిణి నియామకం
రాయచూరు రూరల్: గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి(పీడీఓ)గా ఐఏఎ్‌స్ ప్రొబేషనరీ అధికారిణి నియమితులైన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. బీదర్ తాలూకా మరకల గ్రామ పంచాయతీకి ఇంచార్జి పీడీఓగా ఐఏఎ్‌స్ ప్రొబేషనరీ హెచ్.రమ్యాను నియమిస్తూ జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డా.గిరీష్ ఆదేశాలు జారీ చేశారు. అయితే శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, పీడీఓ ఉమేష్ ఖాజా ఆమెను అభినందించారు. పంచాయతీ పాలనలో విషయాలను గురించి తెలుసుకోడానికి నియమించారన్నారు.
మహిళ ఇంటిలో చోరీ
తాడిపత్రి టౌన్: పట్టణంలోని కృష్ణాపురం 3 రోడ్డులో నివాసం ఉంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగిని మల్లేశ్వరి ఇంటిలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఇంటి తలుపులు, బీరువా పగులగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం మల్లేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి బళ్లారిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటి ఇరుగుపొరుగు చూడగా తలుపులు ధ్వంసం చేసి ఉన్నాయి. మల్లేశ్వరికి ఫోన్ చేసి చెప్పారు. సాయంత్రం చేరుకున్న ఆమె ఇంటిని పరిశీలించగా 10 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు, మరికొన్ని వెండి ఆభరణాలు కనిపించలేదు, దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని క్లూస్‌టీంతో పరిశీలించారు.
బస్సు ఢీకొని బాలుడు దుర్మరణం
రాయచూరు రూరల్: ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని లింగసూగూరులో జరిగింది. శనివారం లింగసూగూరు ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్న బాలురపైకి బస్సు దూసుకెళ్లింది. దీంతో సిద్దరామ(12) అనే బాలుడు మరణించగా, ధనుంజయ(8)కు రెండు చేతులకు గాయాలయ్యాయి. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్సీలకు మేయర్
పదవి కట్టబెట్టాలి
బళ్లారిటౌన్: ప్రస్తుతం జరగనున్న మేయర్ పీఠం ఎన్నికల్లో ఆ పదవిని ఎస్సీ వర్గాల లెఫ్ట్ సముదాయానికి పాలికె మేయర్ పదవిని ఇవ్వాలని కేపీసీసీ మీడియా ప్రతినిధి వెంకటేష్ హెగ్డే, ప్రముఖుడు ఎరుకుల స్వామి డిమాండ్ చేశారు. శనివారం పత్రికా భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహనగర పాలికె అమలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తమ సముదాయానికి మేయర్ పదవి దక్కలేదని గుర్తు చేశారు. ఈ సారైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై తాము ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, బీ.నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్, లోక్‌సభ సభ్యుడు తుకారాం దృష్టికి తెచ్చి కూడా ఒత్తిడి చేస్తున్నామన్నారు. సమావేశంలో దళిత నేతలు హుస్సేనప్ప, వీరేంద్రకుమార్, ఆనంద్, గౌతం, ఫృథ్వీరవికుమార్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తాపుర పరేడ్‌పై 13న హైకోర్టు తీర్పు
హుబ్లీ: కలబుర్గి జిల్లా చిత్తాపురలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ పరేడ్‌పై పాలక, ప్రతిపక్షాలు తమ వాగ్యుద్ధానికి విరామం పలికినట్లుగా లేదు. తాజాగా రూట్ మార్చ్ నిర్వహణకు ప్రత్యేక తేదీ, సమయాన్ని తెలియజేయాలని ఈనెల 12లోగా పిటిషన్‌దారుతో పాటు రాష్ట్ర సర్కారుకు, అన్ని సంస్థలకు కలబుర్గి హైకోర్టు పీఠం దిశానిర్దేశం చేసింది. ఈ నెల 13న కోర్టు తన ఆదేశాన్ని వెల్లడించనుంది. చిత్తాపురలో పరేడ్ ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవడాన్ని ప్రశ్నిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ సమర్పించిన రిట్ విచారణ జరిపిన సదరు హైకోర్టు పీఠం ఈ ఆదేశాలను వెల్లడించింది.
పీడీఓగా ఐఏఎ్‌స్ అధికారిణి నియామకం
పీడీఓగా ఐఏఎ్‌స్ అధికారిణి నియామకం
పీడీఓగా ఐఏఎ్‌స్ అధికారిణి నియామకం
పీడీఓగా ఐఏఎ్‌స్ అధికారిణి నియామకం


