రాయచూరు రూరల్: రాయచూరు నగరసభలో విధులు నిర్వహించడానికి కాంట్రాక్ట్ పద్ధతిపై చేసుకున్న 344 ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని కర్ణాటక సమాచార హక్కుల వేదిక అధ్యక్షుడు రాజు పట్టి ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు నెలల నుంచి కార్పొరేషన్‌గా ఏర్పాటైనప్పటి నుంచి ఇంత వరకు ఉద్యోగాల భర్తీ విషయంలో నల్ల జాబితాలో ఉన్న మైసూరు సంస్థకు అప్పగించారన్నారు. 344 ఉద్యోగాల్లో 136 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసుకోవడాన్ని తప్పుబట్టారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారుల, అధ్యక్షుల, ఇతర పార్టీల నిర్ణయాలతో నిధులు వాడుకున్న అంశంపై చర్చించినట్లు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
హుబ్లీ: ధార్వాడ జిల్లాలోని కుందగోళ తాలూకా చిక్కనేర్తి గ్రామ నివాసి ఫక్కీరేశ హనుమంతప్ప తడసద(23) అనే యువకుడు ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిరటగేరి శివనగౌడ(50), అన్నప్ప(46), బ్యాహట్టి బసప్ప(60), కల్లప్ప (80), హుల్లూర ముదకప్ప(50), శరణప్ప(40), మంటూరు రాయమ్మ (50) తదితరులపై కేసు దాఖలు చేశారు. తన కుమారుడి చావుకు ఆస్తి వివాదాలే కారణం అని మృతుడి తండ్రి ఆరోపించారు.
ఆక్రమణల చెరలో చెరువులు
రాయచూరు రూరల్: నగరాభివృద్ధికి రాష్ట్ర సర్కార్ నుంచి విడుదలైన కోట్లాది నిధులు రికార్డులకు పరిమితమై, చెరువులు ఆక్రమణలకు నిలయమైనట్లు జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు విరుపాక్షి ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చెరువులుగా ఉన్న కృష్ణగిరి కాలనీని లేఅవుట్‌గా చేశారన్నారు. 20 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడాన్ని ఖండించారు. చిన్న నీటిపారుదల శాఖాధికారులు మౌనం వహించడం తగదన్నారు. ఆ శాఖ మంత్రి బోసురాజు, పుత్రుడు రవి ఆధ్వర్యంలో చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయన్నారు. 180 ఎకరాల్లో విస్తరించి ఉన్న మావినకెరె చెరువు భూమిని ఆక్రమించిన వారిపై, ప్రోత్సాహం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు.
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
రాయచూరు రూరల్: నగరంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని మురికి వాడల నివాసుల సంఘం అధ్యక్షుడు జనార్దన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. వివిధ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటున్న పేదలను గుర్తించి సర్వే నంబర్–1403, 1365, 1408, 1257, 2930, 772, 928, 802, 809లో స్థలాలు ఖాళీగా ఉన్నాయని, అలాంటి వాటిని కేటాయించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
ప్రజల నుంచి డబ్బు వసూలు తగదు
రాయచూరు రూరల్: రెవెన్యూ శాఖలో ప్రజల నుంచి అధికారులు డబ్బు వసూలు చేయడం తగదని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో తాలూకా అధ్యక్షుడు తిమ్మప్ప మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రజల నుంచి వివిధ పథకాల కింద ఫించన్‌ల పంపిణీ కోసం రూ.200, రూ.500, రూ.1000 వసూలు చేస్తున్నారన్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
అక్రమాలపై విచారణకు డిమాండ్
అక్రమాలపై విచారణకు డిమాండ్
అక్రమాలపై విచారణకు డిమాండ్