
చదువుల తల్లీ పాహిమాం
చంద్రలేఖ విభూషిత మాత రూపంలో శాకంబరీ దేవి
సరస్వతీ దేవి అలంకరణలో
లక్ష్మీ వేంకటేశ్వరుడు
సరస్వతీ దేవి అలంకారం
బనశంకరి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు సరస్వతీ మాత అలంకారంలో భక్తులకు బనశంకరీదేవీ దర్శనమిచ్చింది. అర్చకులు సోమవారం వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం చేపట్టి తరువాత అమ్మవారికి విశేష అలంకారం చేశారు. యాగశాలలో శ్రీసరస్వతి హోమం చేపట్టి మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి చేశారు. ఆలయంలోని శాకంబరీదేవిని శ్రీచంద్రలేఖ విభూషిత దేవి రూపంలో అలంకరించారు. పెద్దఎత్తున అమ్మవారిని దర్శించుకుని నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన గావించారు.
బొమ్మనహళ్లి: హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని ఆగర గ్రామంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రధాన అర్చకుడు అనంతపురం చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యుడు అయిన సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు.

చదువుల తల్లీ పాహిమాం

చదువుల తల్లీ పాహిమాం