సోమవారం సాయంత్రం మైసూరు ప్యాలెస్ ముందు జంబూసవారీ సాధన
ఫిరంగుల విస్ఫోటాలతో ఏర్పడిన అగ్నిగోళాలు
మైసూరు: పాటలు, సంగీతం మైసూరువాసులను, పర్యాటకులను తన్మయుల్ని చేస్తున్నాయి. మైసూరు దసరా వేడుకల సందర్భంగా ప్యాలెస్ ముందు వేదికపై ఆదివారం రాత్రి గాయకుడు విజయ్ ప్రకాశ్ బృందం పాడిన పాటలకు ప్రేక్షకులు ఆనందంతో స్టెప్పులు వేశారు. విజయప్రకాశ్ వేదిక పైకి వస్తూనే చాముండేశ్వరి కీర్తనను ఆలపించారు. తరువాత హబ్బ హబ్బ ఇది కరునాడు హబ్బ మనె అనే పాటలో అలరించారు. పవర్‌స్టార్ పునీత్ రాజ్ పాట అయిన బొంబే హేళుతైతె.. నీనే రాజకుమార అనే పాటకు ప్రేక్షకులు లేచి నిలబడి మొబైల్‌లో లైట్లు వేసి పునీత్‌కు నివాళులర్పించారు. ఇక బన్నిమంటప కవాతు మైదానంలో డ్రోన్లతో చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి.
మరోసారి ఫిరంగుల గర్జన
గజరాజులకు మరోసారి ఫిరంగుల తాలీమును నిర్వహించారు. సోమవారం కవాతు మైదానంలో ఏనుగులు, గజరాజులను నిలబెట్టి ఫిరంగి మోతలను మోగించారు. భీకరంగా అగ్నిగోళాలు, శబ్ధాలు వెలువడినా అవి బెదరలేదు. అలాగే గజరాజు అభిమన్యుతో కలిసి ప్యాలెస్ ముందు జంబూసవారీ రిహార్సల్‌ను జరిపారు. నిజమైన జంబూసవారీలో మాదిరిగా పోలీసులు అంబారీ మీద పూలు చల్లి సెల్యూట్ చేశారు. డిసిఎఫ్ ప్రభుగౌడ, అధికారులు పాల్గొన్నారు.
విజయ్ ప్రకాశ్ గానాలాపన
అంబరంలో అద్భుతం.. వేలాది డ్రోన్లతో ఏనుగు అంబారీ రూపం
భూగోళంలో భారతదేశం ఆవిష్కారం
పతాకస్థాయికి మైసూరు దసరా సంబరాలు
గానామృతం.. నిప్పుల వర్షం
గానామృతం.. నిప్పుల వర్షం
గానామృతం.. నిప్పుల వర్షం
గానామృతం.. నిప్పుల వర్షం