
హౌస్‌కీపర్ దొంగావతారం
యశవంతపుర: పని చేస్తున్న ఇంటిలో బంగారం, వజ్రాలను చోరీ చేసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగని బెంగళూరు జేసీ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. మిల్లర్ రోడ్డులోని ఒక ఇంటిలో యూపీ నుంచి వచ్చిన వలస కార్మికుడు హౌస్‌కీపర్‌గా పని చేస్తున్నాడు. ఇంటిలో విలువైన బంగారం, వజ్రాల నగలు ఉన్నట్లు చూశాడు. ఇటీవల 236 గ్రాముల బంగారం, వజ్రాల నగలను దోచుకొని పరారయ్యాడు. యజమాని జేసీ నగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, యూపీలో దాగి ఉన్న దొంగని పట్టుకుని వచ్చారు. రూ.53 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు.
హైవేలలో పిల్ల దొంగల ముఠా..
దొడ్డబళ్లాపురం: 3 రోజుల్లో 37 దోపిడీలకు పాల్పడిన 6 మంది మైనర్ల గ్యాంగ్‌ను దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. మాదనాయకనహళ్లి, దొడ్డబళ్లాపురం, సూర్యనగర, బ్యాడరహళ్లి నెలమంగల పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మూడు బైక్‌లపై హైవేలలో తిరిగేవారు. బైకిస్టులు, లారీలు, కార్లు తదితర వాహనదారులను అడ్డగించి దోపిడీలకు పాల్పడేవారు. డబ్బులు ఇస్తే సరే, ఎవరైనా ఎదురుతిరిగితే కత్తితో దాడి చేసి దోచుకుని పరారయ్యేవారు. అన్ని దోపిడీలు ఒకే రకంగా జరగడంతో సీసీ కెమెరాల చిత్రాలు, బాధితుల సమాచారం మేరకు సోదాలు చేసి పిల్ల దొంగల ముఠాను పట్టుకున్నారు. కొంత డబ్బు, విలువైన వస్తువులు, బైక్‌లను సీజ్ చేశారు.
వజ్రాల నగలు సీజ్