
కేసు కొట్టివేతకు ప్రజ్వల్ అర్జీ
శివాజీనగర: ఇంటి పనిమనిషి మీద అత్యాచారం, అశ్లీల వీడియోల కేసులో జేడీఎస్ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ఆగస్టు నుంచి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జీవితఖైదును అనుభవిస్తుండడం తెలిసిందే. కింద కోర్టు విధించిన యావజ్జీవిత శిక్షను రద్దు చేయాలని ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌లో ఏముంది?
2021 జనవరి నుంచి 2022 జనవరి ఆఖరి వరకు బెంగళూరు బసవనగుడిలోని ఇంట్లో ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. 2024 మే 10న మా ఇంటికి వచ్చిన సిట్ అధికారులు పరుపులు, దిండ్లను తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మూడేళ్లపాటు బెడ్‌పై బట్టలను మార్చకుండా, క్లీన్ చేయకుండా ఉంటారా అనేది కింది కోర్టు పరిగణించలేదు అని ప్రజ్వల్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇంకా అనేక అంశాలను అందులో ప్రస్తావించి కేసును కొట్టివేయాలని కోరాడు. గోదాములో కూడా మూడేళ్ల తరువాత దుస్తులపై మరకలు, ఇతర ఆధారాలను సేకరించామనడం నమ్మశక్యం కాదని, కాబట్టి కేసును రద్దు చేయాలని విన్నవించాడు.
హైకోర్టులో పిటిషన్ దాఖలు