
ఆకాశంలో మాయాజాలం
ఆకట్టుకున్న పాలపుంత, గర్జిస్తున్న పులి ఆకారాలు
పొట్టేళ్ల ప్రదర్శనలో విన్యాసాలు
మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలలో ఆకాశంలో అద్భుతం జరిగింది. సింహవాహనంపై ఆసీనురాలైన చాముండేశ్వరి అమ్మవారు, దసరా అంబారీ ఏనుగు, పెద్ద పులి, సర్పంపై నర్తిస్తున్న శ్రీకృష్ణుడు, పాల పుంత ఇలా అనేక రూపాలు ఆవిష్కృతమయ్యాయి. వాటిని చూస్తూ ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.
డ్రోన్ల ఇంద్రజాలం
ఆదివారం రాత్రి అత్యంత ఆకర్షణీయమైన డ్రోన్ల కళా ప్రదర్శన విజయవంతంగా సాగింది. బన్ని మంటప కవాతు మైదానంలో రాష్ట్ర విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 3 వేల డ్రోన్లతో ప్రదర్శన ఆద్యంతం అబ్బురపరచింది. టెక్నీషియన్లు ఆకాశంలో డ్రోన్లను క్షణాల్లోనే రకరకాల రూపాల్లో అమర్చుతూ కళారూపాలను ఏర్పరిచారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌బుక్ రికార్డులోకి ఎక్కడం గమనార్హం. వేలాదిమంది ప్రజలు తరలివచ్చి డ్రోన్ షోను వీక్షించారు. కొన్ని ఆకారాలకు 2 వేల డ్రోన్లు, కొన్ని ఆకారాలకు 3 వేల డ్రోన్లను ఉపయోగించారు. అవాంతరాలు లేకుండా సజావుగా సాగింది. నల్లటి ఆకాశంలో రకరకాల లైట్లతో డ్రోన్లు ఆకారాలను ఏర్పరిచాయి. ప్రజలు మొబైళ్లు, కెమెరాలతో బంధించారు.
హుషారుగా గాన కచేరీ
ప్యాలెస్ ఎదుట వేదికపై ప్రముఖ గాయకుడు కునాల్ గంజన్‌వాలా బృందం హిందీ, కన్నడ పాటల గానకచేరీ ప్రేక్షకులను ముగ్ధుల్ని చేసింది. పాటలు, సంగీతానికి మైమరిచి చిందులేశారు. అలాగే శునకాల ప్రదర్శన ఆకట్టుకుంది.
గాన కచేరీలో ప్రేక్షకుల ఉత్సాహం
కునాల్ గంజన్‌వాలా పాట కచేరీ
కాళీయ మర్ధనం చేస్తున్న కన్నయ్య
సింహ వాహనంపై చాముండేశ్వరి మాత రూపం ఆవిష్కరణ
3 వేల డ్రోన్లతో వినూత్న ప్రదర్శన
మైసూరు దసరాలో మంత్రముగ్ధం

ఆకాశంలో మాయాజాలం

ఆకాశంలో మాయాజాలం

ఆకాశంలో మాయాజాలం