
యువ దసరా ఉల్లాసం
మైసూరు: నాడ హబ్బ మైసూరు దసరాలో సుమారు 10 రోజుల నుంచి నిత్యం సాయంత్రం నగరవాసులను, పర్యాటకులను గాన సుధామృతంతో, నృత్యాలతో రంజిపంజేసిన యువ దసరా సంభ్రమం కన్నుల పండువగా ముగిసింది. నగర సమీపంలోని ఉత్తనహళి జ్వాలాముఖి దేవాలయం వద్ద సాగిన యువత దసరాలో ఆద్యంతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చివరిరోజు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ పాటలు, డ్యాన్సులు, డీజే ఇంద్రజాలంతో ఉత్సాహభరింతగా సాగింది. ధూమ్ మచాలే, ధూమ్ మచాలే అనే పాట పాడుతూ ప్రఖ్యాత గాయని సునిధి చౌహాన్ డ్యాన్సు చేస్తూ ఉంటే ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోయారు. వేదిక ముందు భాగంలో వేలాదిమంది యువత సైతం నృత్యాలు చేస్తూ మైమరిచారు. ఆమె పలు హిట్ కన్నడ, హిందీ పాటలను ఆలపిస్తూ నృత్యంతో ఆకట్టుకున్నారు. జల్లుల మధ్య యువతరం కేరింతలు కొట్టారు.
● సునిధి చౌహాన్ గానంతో సమాప్తం
● పదిరోజులు నాన్ స్టాప్ కేరింతలు