
కాత్యాయనీ.. జగజ్జననీ
● కొనసాగుతున్న శరన్నవ రాత్రి ఉత్సవాలు
బళ్లారి రూరల్/బళ్లారి అర్బన్: నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం బళ్లారి నగరంలోని విద్యా నగర్‌లో గంగా మాత, అభయాంజనేయ స్వామి ఆలయాల్లో కాత్యాయిని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా పుష్పాలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనక దుర్గమ్మను ఆభరణాలతో అలంకరించారు. విజయదశమి వరకు రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈఓ హనుమంతప్ప తెలిపారు. అలాగే హవంబావి సీతారామ ఆశ్రమంలో మహాలక్ష్మి అలంకరణ, పటేల్ నగర్ చిన్నదుర్గమ్మను సరస్వతీ దేవిగా అలంకరించారు. మిల్లర్‌పేట్ మల్నాడు దుర్గమ్మను విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఏళ్లు మక్కళ తాయి, బెంగళూరు రోడ్డు వాసవీ మాత, నగరేశ్వరి, బెంకి మారెమ్మ తదితర అమ్మవారి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
బన్ని మహంకాళికి పూజలు..
సిరుగుప్ప: శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏడవ రోజున ఆదివారం నగరంలో వివిధ ఆలయాల్లో అమ్మవార్లను విశేషంగా అలకరించారు. 16వ వార్డు కృష్ణానగర్‌లో బన్ని మహంకాళి అమ్మవారికి విశేష పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
అమ్మవార్లకు విశేష అలంకరణ..
హొసపేటె: ఆలయాల్లో దసరా శరన్నవ రాత్రి ఉత్సవాల కోలాహలం నెలకొంది. ఏడవ రోజు ఆదివారం నగరంలోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఎంజీ నగర్, టీబీ డ్యాం రహదారిలో ఉన్న ముకాంబిక దేవాలయం, ఎల్లమ్మగుడ్డలో ఉన్న రేణుక దేవికి పూజలు చేశారు. ఉచ్చమ్మ దేవిని తమలపాకులతో విశేషంగా అలంకరించారు. మహిళలతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు.
పల్లకీలో ఊరేగిన కాళికా మాత..
రాయచూరు రూరల్: నగరంలోని కాళికా దేవాలయంలో అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. మమదాపూర్‌లో మారికాంబ దేవి, కాస్ బావి అంబా భవానీ, కందగడ్డ మారెమ్మ, గుంజల్లిలో శారదా దేవి రూపంలో అలకరించారు. సుంకులమ్మ దేవిని దుర్గామాతగా పూజించారు. కిల్లేరి మఠంలో శాంత మల్ల శివాచార్యులు మహిళలకు ఒడి బియ్యం పంచారు. ఉప్పరవాడి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వర ఆలయంలో గరుడ వాహనంలో స్వామిని ఊరేగించారు. మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో శరన్నవ రాత్రి సాంస్కృతిక ఉత్సవాలను మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప ప్రారంభించారు. తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ నుంచి వచ్చిన కళా బృందాలు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాయి. కళాకారులు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇక వైజాగ్ నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రతిభను చాటారు.

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ

కాత్యాయనీ.. జగజ్జననీ