
బీవీబీ కళాశాలలో స్నేహ సమ్మేళనం
హుబ్లీ: తాలూకాలోని నుల్వి గ్రామంలో ఉన్న శ్రీ జగద్గురు రేణుకాచార్య బీవీబీ కళాశాలలో ఆదివారం వార్షిక స్నేహ సమ్మేళనం, దీపదాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యుడు డాక్టర్.ఎస్‌వీ బెళగలి మాట్లాడుతూ.. గురువు కన్నా శ్రేష్టమైన స్థానం సమాజంలో ఏది లేదన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. బీవీబీ విభాగం ముఖ్యులు ఎంఆర్ పాటిల్, సువర్త న్యూస్ చానల్ సీనియర్ పాత్రికేయుడు గురురాజ హుగారను సన్మాంచారు. కార్యక్రమంలో డాక్టర్ బండివాడ కావ్య ఉమాసారే పాల్గొన్నారు.