
తుంగభద్ర నదీ తీరంలో మొసలి ప్రత్యక్షం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని శివాపుర సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఒక పెద్ద మొసలి సేద తీరుతూ శనివారం కనిపించింది. ఉన్నట్టుండి మొసలి ప్రత్యక్షం కావడంతో నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శివాపుర గ్రామ పంచాయతీలోని నారాయణపేట సమీపంలో ప్రవహించే తుంగభద్ర నది ఒడ్డున ఈ మొసలి కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఒక పర్యాటకుడు తన మొబైల్ కెమెరాలో బంధించాడు.
కత్తితో యువకుడి హల్‌చల్
హుబ్లీ: దావణగెరెలో ఓ ఆలయం ఎదుట ఇతర మతానికి చెందిన యువకుడు తల్వార్ పట్టుకొని సినీ ఫక్కీలో సంచరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మట్టికల్‌లోని బసవేశ్వర ఆలయం ఎదుట ఉన్న రోడ్డులో ఓ యువకుడు తల్వార్ చేతపట్టుకొని సినిమా స్టైల్‌లో నడుస్తున్నాడు. దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఆర్‌ఎంసీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.