
వరుణ ప్రతాపం.. లోతట్టు జలమయం
రాయచూరు రూరల్: ఎగువ భాగంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. రాయచూరు, కలబుర్గి, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు భీమా నదికి వరద పోటెత్తింది. నదిలో 3.40 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నందున నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలబుర్గి జిల్లాధికారి ఫౌజియా తరన్నుమ్ హెచ్చరించారు. బీదర్ జిల్లా హులసూరు, బసవ కళ్యాణ ప్రాంతాల్లో పంట పొలాల్లోకి, ఇళ్లలోకి నీరు చేరాయి. హులసూరు శాసన సభ్యుడు శరణు సలగార్ అంబేవాడి, సూలదాబాక, గోవర్దన తాండా, అంతర్ భారతి తాండాల్లో నీటిలో నడుచుకుంటూ వెళ్లి పంటలను పరీశీలించారు. కలబుర్గి గాణాగపుర నారద దత్తాత్రేయ ఆలయంలోకి నీరు చేరాయి. భక్తులు నీటిలో వెళ్లి పూజలు చేశారు.చిత్తాపూర్ తాలూకా దండోతి, సేడం తాలూకా సటపటనహళ్లి పూర్తిగా నీట మునిగింది. గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్‌సింగ్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. భీమా నది ప్రవాహాన్ని పరిశీలించి బాధిత ప్రజలను పరామర్శించారు. విజయపుర–షోలాపూర్ మధ్య రాకపోకలు బంద్ కావడంతో వాహనాలు స్తంభించి పోయాయి. బాగల్‌కోటె జిల్లా రబకవి బనహట్టి తాలూకాలోని మహాలింగపురలో దర్శన్(11) అనే బాలుడు గోడ కూలి మరణించాడు.
కల్యాణ కర్ణాటకలో వరద విలయం
భీమా నదికి 3.40 లక్షల
క్యూసెక్కుల నీరు
బాధిత ప్రాంతాల్లో మంత్రి,
ఎమ్మెల్యేల పర్యటన

వరుణ ప్రతాపం.. లోతట్టు జలమయం

వరుణ ప్రతాపం.. లోతట్టు జలమయం

వరుణ ప్రతాపం.. లోతట్టు జలమయం