నకిలీ సర్టిఫికెట్లు | - | Sakshi
Sakshi News home page

నకిలీ సర్టిఫికెట్లు

Sep 26 2025 7:12 AM | Updated on Sep 26 2025 7:12 AM

నకిలీ

నకిలీ సర్టిఫికెట్లు

రూ.లక్షలు కొడితే

బనశంకరి: డాక్టర్‌ కావాలనేది ఎంతోమంది యువత, తల్లిదండ్రుల కల. ఆ కలను తీర్చుకోవడానికి పక్కదారులు పట్టేవారికి కొదవలేదు. కర్ణాటక పరీక్షా ప్రాధికార (కేఇఏ)కు నకిలీ అంగవైకల్య మెడికల్‌ ధ్రువపత్రాలను అందజేసి దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ మెడికల్‌ సీట్లు పొందడానికి 21 మంది అభ్యర్థులు ప్రయత్నించిన కేసులో డొంకంతా కదిలింది. అభ్యర్థులతో పాటు వారికి సహకరించినవారి జాబితాను బెంగళూరు మల్లేశ్వరం పోలీసులు బయటకు తీశారు. నకిలీ సర్టిఫికెట్లను సృష్టించిన ఇద్దరు ప్రభుత్వ డాక్టర్లతో పాటు ఐదుమందిని అరెస్ట్‌చేశారు. నకిలీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది.

చెవులు వినిపించవంటూ నాటకం

ఇటీవల మెడికల్‌ కౌన్సెలింగ్‌లో కొందరు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించినట్లు పరీక్షా ప్రాధికార (కేఈఏ) అధికారులు గమనించారు. దీంతో స్థానిక మల్లేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 21 మంది యువతీ యువక అభ్యర్థులు ఎంబీబీఎస్‌ సీట్ల కు దరఖాస్తు చేసిన సమయంలో తమకు బధిరత్వం ఉందని, దివ్యాంగుల కోటాలో సీట్లను కేటాయించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ అభ్యర్థులకు కేఈఏ నిబంధనల ప్రకారం జూలై 17వ తేదీన విక్టోరియా ఆసుపత్రి, నిమ్హాన్స్‌లో ఆడియోగ్రామ్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ సమయంలో వారికి చక్కగా వినిపిస్తోందని, ఎలాంటి బధిరత్వం లేదని వైద్యులు గుర్తించారు. అభ్యర్థులు అందజేసిన ఆడియోలాజికల్‌ నివేదిక అధికారికం కాదని ధృవీకరించారు. మరిన్ని వివరాలను అందించాలని 21 మంది అభ్యర్థులకు నోటీస్‌ జారీచేశారు. వెంటనే ముగ్గురు విద్యార్థులు, తల్లిదండ్రులు విచారణకు హాజరై తాము మోసపోయామని, కొందరు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని వివరించారు.

ఎంబీబీఎస్‌ సీట్ల కోసం 21 మంది అభ్యర్థులకు ఆశ

తనిఖీలలో దొరికిన యువత

ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఓ క్లర్కు అరెస్టు

= బెంగళూరు నుంచి హొసపేటెకు లింకు

సూత్రధారి భర్మప్ప

ఉపాధ్యాయుడు భర్మప్ప.. తోటి ఉపాధ్యాయులు పిల్లలకు నీట్‌ ద్వారా మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని ప్రచారం చేసుకునేవాడు. పై అభ్యర్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఇదే మాట చెప్పాడు. ఇందుకోసం అంగ వైకల్యం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు పుట్టించాడు. అభ్యర్థుల నుంచి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు బేరం మాట్లాడారు. మొదట రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు అడ్వాన్స్‌ తీసుకున్నారు. భర్మప్ప ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వారందరికీ బధిరత్వం ఉన్నట్లు సర్టిఫికెట్లను సంపాదించాడు. ఇందుకుగాను ఆ వైద్యులకు కూడా సొమ్ములో వాటా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితులు అందరిపై చర్యలు తీసుకుంటామని, కానీ అభ్యర్థుల భవిష్యత్తు పాడైపోరాదని వారిని హెచ్చరించి వదిలిపెట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

నకిలీ సర్టిఫికెట్లు1
1/1

నకిలీ సర్టిఫికెట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement