
కుండపోత వర్షం.. లోతట్టు జలమయం
వాననీటిలోనే వెళుతున్న లారీ
దుకాణాల్లోకి చేరిన వాన నీరు
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి, బీదర్ జిల్లాల్లో కురిసిన వర్షాలకు రాష్ట్ర రహదారులు చెరువులుగా మారాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రెండు అడుగుల మేర నీరు పారాయి. అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు శాసీ్త్రయంగా రహదారుల నిర్మాణం చేపట్టడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. సింధనూరు–కుష్టిగి ప్రధాన రహదారి జలమయం కావడంతో కాయగూరల దుకాణాలలో వాన నీరు చేరాయి. బీదర్‌లో నిరంతరం కురుస్తున్న వానలకు చుళికి వాగులో నీరు వరదలా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. హులసూరు, బసవ కళ్యాణ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారి బంద్ అయింది. కలబుర్గి జిల్లా దేవల గాణగాపురలో భీమా నది ఉప్పొంగి ప్రవహించడంతో అఫ్జల్‌పుర తాలూకా మణ్ణూరుకు చెందిన బాగేష్(20) అనే యువకుడు కాలు జారి పడి కొట్టుకు పోయి శవమై తేలినట్లు పోలీసులు తెలిపారు.

కుండపోత వర్షం.. లోతట్టు జలమయం

కుండపోత వర్షం.. లోతట్టు జలమయం

కుండపోత వర్షం.. లోతట్టు జలమయం