
హోసూరు బస్టాండ్‌లో సమస్యల మోత
హుబ్లీ: జంట నగరాల ప్రజలతో పాటు రాష్ట్రంలోనే పేరు మోసిన ధార్వాడ జిల్లా రవాణా శాఖ జిల్లా కేంద్రంలో ధార్వాడతో పాటు హుబ్లీలో మూడు ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రధానంగా గోకుల్ రోడ్డు బస్టాండ్ ద్వారా అంతర్జాతీయ, రాష్ట్ర ప్రయాణికులకు సేవలు అందుతున్నాయి. ఇక తాతల కాలం నాటి చెన్నమ్మ సర్కిల్‌లోని పాత బస్టాండ్ పునర్నిర్మాణానికి నోచుకొని ప్రయాణికులకు తగిన సేవలు అందిస్తోంది. హోసూరు ప్రాంతీయ బస్టాండ్‌లో తాగునీటి కోసం కొన్ని ప్లాట్‌ఫారాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి కార్పొరేట్, సామాజిక బాధ్యత తదితర నిధుల ద్వారా హోసూరు బస్టాండ్ కింద భాగంలో ఒక రూపాయి కాయిన్‌తో ఒక లీటర్ తాగునీరు వచ్చేలా ఏర్పాటు చేశారు. అయితే చిన్న ఒక్క రూపాయి కాయిన్ తప్పకుండా తీసుకురావాల్సిందే.
రూపాయి కాయిన్ వేస్తేనే నీరు
ఇక్కడ ఎందుకంటే ఆ చిన్న రూపాయి కాయిన్ వేస్తేనే నీరు లభిస్తాయి. లేకపోతే బాటిల్ నీరుకు రూ.10–20 ఖర్చు పెట్టక తప్పడం లేదు. ఇక బీజాపూర్ ప్రాంగణానికి వస్తే ఇక్కడ ఫిల్టర్ నిర్మాణం ఏర్పాటు అయి తాగునీటి సరఫరా కొన్నాళ్ల పాటు అందుబాటులో ఉండగా ఇటీవల కొన్ని నెలల పాటు ఈ ఫిల్టర్ యంత్రాలు పని చేయడం లేదు. దీంతో ఇక్కడ తాగునీరు బంద్ అయింది. డబ్బులు లేని పేద వారు ఒక్క రూపాయి కాయిన్ పట్టుకొని అల్లంత దూరంలోని మరో ప్లాట్‌ఫాంలోకి వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే ఇక్కడ సబ్ వే నిర్మాణం, అండర్ గ్రౌండ్ పాస్, పైవంతెన పాస్ సేవలు బాగున్నాయి. ఇక్కడ పరిశీలిస్తే ఓ మరుగుదొడ్డి బంద్ అయినట్లుగా కనిపిస్తోంది. పక్కన ఉన్న దుకాణం నిర్వాహకులను విచారిస్తే ఇది చాలా ఏళ్ల నుంచి బంద్ అయింది. ఇది నిరుపయోగంగా మూలన పడిందన్నారు.
వృద్ధులకు తప్పని తిప్పలు
ఇక ఇక్కడ మూత్రవిసర్జన, ఉచితంగా మరుగుదొడ్డికి రూ.5 చెల్లించడం కాస్త ప్రయాణికులకు ఊరటనిచ్చే విషయం. అయితే కింది భాగంలోని ప్లాట్‌ఫాంలో బస్సులను చేరుకోవాలంటే మెట్లు దిగక తప్పని పరిస్థితి నెలకొంది. దిగేటప్పుడు వృద్ధులు, ఇతర అనారోగ్య ఇబ్బందులు ఉన్న వారు చాలా తిప్పలు పడక తప్పడం లేదు. మొత్తానికి అటు అంతర్రాష్ట్ర, ఇటు వివిధ జిల్లాలకు, బీఆర్‌టీఎస్ చిగరి బస్సుల రవాణాకు ఈ బస్టాండ్ ద్వారానే ప్రయాణికులకు అందుబాటులో ఉండటం విశేషం. వీలైనంత త్వరగా మరమ్మతుకు గురైన బీజాపూర్ ప్లాట్‌ఫాం సమీపంలోని తాగునీటి ఫిల్టర్ యూనిట్‌ను తక్షణమే బాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంబంధిత అధికారులతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్ లాడ్, కేంద్ర మంత్రి, ఈ ప్రాంత ఎంపీ ప్రహ్లాద్‌జోషి, ఇతర సంబంధిత ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
పని చేయని ఫిల్టర్ యూనిట్లు
నిరుపయోగంగా మరుగుదొడ్డి