ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా? | - | Sakshi
Sakshi News home page

ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా?

Sep 23 2025 8:23 AM | Updated on Sep 23 2025 8:23 AM

ఆలయంల

ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా?

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ అంటరానితనం కనిపిస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆలయంలోకి దళితుల ప్రవేశం నిషిద్ధమా? అనే మీమాంస రాయచూరు తాలూకా ఆత్కూరులోని అంబా భవాని ఆలయం వద్ద చోటు చేసుకుంది. దేవీ శరన్నవ రాత్రుల సందర్భంగా ఓ సమాజ యువకులు అమ్మవారి ఆలయంలో దర్శనానికి, మాల వేసుకోవడానికి వెళ్లగా ఆలయ పూజారి వారిని బయటే నిలిపి వారికి కండువా ఇచ్చి, కుంకుమ దిద్దడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ విషయంపై వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు విచారణకు నడుం బిగించారు. ఇరు వర్గాల మధ్య రాజీ ప్రక్రియ కోసం పోలీసులు శాంతి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా? 1
1/1

ఆలయంలోకి దళితులకు ప్రవేశం లేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement