
రాజకీయ కుట్రల వల్లే సర్వే గందరగోళం
బళ్లారిటౌన్: సిద్దరామయ్య ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సోమవారం నుంచి ప్రారంభించిన కులగణన ఆర్థిక సామాజిక స్థితిగతుల సర్వేపై రాష్ట్ర సఫాయి కర్మచారి అభివృద్ధి మండలి మాజీ అధ్యక్షుడు హెచ్.హనుమంతప్ప విమర్శలు గుప్పించారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ సిద్దరామయ్య వైఖరిపై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పోరాటం జరిగాక బీసీ కమిషన్ అధ్యక్షుడు 33 హిందూ కులాలను క్రైస్తవ కులాల జాబితా నుంచి సమీక్షకు వాడే యాప్‌లో హైడ్ చేసినట్లుగా తెలిపారన్నారు. ఈ విధంగా అధికారికంగా తొలగించకుండా మిగిలిన కులాలన్నీ ఎస్సీ కావడం ఆందోళనకర పరిణామం అన్నారు. ఈ విషయంలో సదరు కమిషన్ తీరు సమంజసం కాదన్నారు. ఎస్సీ క్రైస్తవ కులాలను ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పాలి లేకుంటే అన్ని జిల్లాల్లో దళితులు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తారని హెచ్చరించారు. తక్షణమే ఆ కమిషన్ స్పష్టీకరణ ఇవ్వాలన్నారు. అధికార ప్రకటనలో ఎస్టీ కులాల క్రైస్తవ ట్యాగ్ తొలగించాలని ఆయన కమిషన్‌ను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రముఖులు నరసింహ బాబు, సోమశేఖర్, తిప్పమ్మ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.