
నగర స్వచ్ఛతకు చేతులు కలుపుదాం
సాక్షి బళ్లారి: నగర స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుదామని నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం స్వచ్ఛభారత్ అభియాన్‌లో భాగంగా నగర మండల బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 36వ వార్డులోని హవంబావి వద్ద ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో, ఆలయం లోపల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పెద్ద సంఖ్యలో చీపురు పట్టుకొని చెత్తను ఊడుస్తూ శుభ్రం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లోనే చెత్తను పారవేయాలని సూచించారు. కార్యక్రమంలో నగర బీజేపీ అధ్యక్షుడు, మాజీ మేయర్ గుర్రం వెంకటరమణ, కార్పొరేటర్ కల్పన వెంకటరామిరెడ్డి, మాజీ మేయర్ మారుతీ ప్రసాద్, బీజేపీ ప్రముఖులు హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.
గాంధీజీ, మోదీ కలలను
సాకారం చేద్దాం
నగర మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి