
ఫిరంగులకు బెదరని గజరాజులు
మైసూరు : ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవ వేడుకలో ప్రముఖ ఆకర్షణ అయిన జంబూసవారీలో పాల్గొనే ఏనుగులకు, అశ్వాలకు రెండవ విడత ఫిరంగుల పేలుడు శబ్ధాల మధ్య రెండవసారి తాలీము నిర్వహించారు. కెప్టెన్ అభిమన్యు ఆధ్వర్యంలో ఏనుగులు, అశ్వాలకు శుక్రవారం రెండవ విడత తాలీము పూర్తి చేశారు. మైసూరు నగరంలో ఉన్న వస్తు ప్రదర్శన శాల ఆవరణలో అటవీ శాఖాధికారులు, పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రెండవసారి తాలీము విజయవంతమైంది. అభిమన్యు ఆధ్వర్యంలో ఉన్న సుమారు 14 ఏనుగులు, జంబూసవారీ ఊరేగింపునకు హాజరయ్యే సుమారు 30 అశ్వాలు ఈ తాలీములో పాల్గొన్నాయి. జంబూ సవారీ ఏనుగులను, అశ్వాలను వరుసగా నిలబెట్టి ఫిరంగులతో భారీ శబ్దాలను చేస్తూ పేలుళ్లు జరపడంతో ఏనుగులు కాని, అశ్వాలు కాని ఒక్క అడుగు కూడా ముందుకు వెనుకకు వేయకుండా నిలిచాయి. తాలీము ఆనంతరం అదనపు బలగాల డీసీపీ సిద్దనగౌడ పాటిల్ మాట్లాడుతూ శుక్రవారం నిర్వహించిన రెండవ విడత పేలుళ్ల మధ్య తాలీము విజయవంతం అయిందన్నారు. ఈ తాలీములో జంబూసవారీ 14 ఏనుగులతో పాటు పోలీసు శాఖకు చెందిన 30 అశ్వాలు కూడా పాల్గొన్నట్లు తెలిపారు.

ఫిరంగులకు బెదరని గజరాజులు