
నాడ హబ్బ వేడుకలకు రాచనగరి ముస్తాబు
మైసూరు : మరో మూడు రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన నాడ హబ్బ మైసూరు దసరా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో మైసూరు నగరం మొత్తం విద్యుత్ కాంతుల వెలుగులో దసరా వేడుకలకు ముస్తాబవుతోంది. మైసూరు దసరా ఏర్పాట్లు మొత్తం ఇప్పటికే పూర్తి కావస్తుండడంతో పాటు అన్ని రకాల కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. సెస్క్ ఆధ్వర్యంలో మైసూరు నగరంలో సుమారు 135 కి.మీ.వ్యాప్తిలో రోడ్లకు సుమారు 118 సర్కిళ్లలో విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. వాటితోపాటు ప్రముఖ రోడ్లు, సర్కిళ్లలో ఆకర్షణీయమైన చిత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మైసూరు నగరంలో ఉన్న ప్రముఖ రోడ్లు, నగర సమీపంలో ఉన్న ప్రముఖ రహదారులను దీపాలంకరణ చేయడానికి ట్రయల్ రన్ చేస్తున్నారు. దీపాలంకరణ కోసం సుమారు 300 కిలో వ్యాట్ల 2,57,520 యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. మైసూరు నగరంలోని హార్డింజ్ సర్కిల్, కేఆర్ సర్కిల్, చామరాజ సర్కిల్‌లో ఉన్న గోపురాలకు రంగులు వేశారు. అక్కడ ఉన్న విగ్రహాలను కూడా శుభ్రం చేశారు. జంబూసవారీ ఊరేగింపు వెళ్లే మార్గంలో ఉన్న అన్ని పుట్‌పాత్‌లు, రోడ్లు అభివృద్ధి చేయడం ద్వారా దసరా జంబూసవారీ వెళ్లే మార్గంలో మైసూరు ప్యాలెస్ చుట్టు కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సుమారు రూ.114.66 లక్షల వ్యయంతో ఈ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దివంగత దేవరాజ అరసు రోడ్డు జేఎల్‌బీ రోడ్డు, కేఆర్ సర్కిళ్లలో త్రీడీ పెయింటింగ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోను ఏర్పాటు చేస్తున్నారు.

నాడ హబ్బ వేడుకలకు రాచనగరి ముస్తాబు

నాడ హబ్బ వేడుకలకు రాచనగరి ముస్తాబు