
శక్తినగర్‌లో సమస్యలు కోకొల్లలు
రాయచూరు రూరల్: విద్యుత్ ఉత్పదాన కేంద్రంగా పేరు గాంచిన శక్తినగర్ అభివృద్ధిలో మాత్రం పూర్తీగా వెనుకబడింది. గ్రామీణ ప్రాంతాల మాదిరిగా పారిశుధ్యం, రహదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికార యంత్రాంగం మౌలిక వసతుల కల్పనలో విఫలమైంది. ఇరు పార్టీల నేతలు శక్తినగర్ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పంచాయతీ అధికారం కాంగ్రెస్ అధీనంలో ఉండగా.. ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కావడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఏ ప్రాంతానికి వెళ్లిన చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. మురుగు కాలువలు కాగితాలతో నిండిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. రహదారులు గుంతలు పడటంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వార్డుల పరిస్థితి గురించి పట్టించుకునే వారు లేరు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ సభ్యులు ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు. వీరు చేసిందేమీ లేదు. రహదారుల మరమ్మతులో పంచాయతీ అధికారులు, సభ్యులు, శాసన సభ్యులు మధ్య అవగాహన లేకపోవడంతో శక్తినగర్ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఆ ప్రాంతంలో విద్యుత్ ఉత్పాదన చేసే ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. కాగా.. రెండు మూడు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ల చుట్ట పక్కల చెత్తా చెదారం నిండిపోయింది.
కాగితాలతో మూసుకుపోయిన మురుగు కాలువ
అపార్ట్‌మెంట్ల చుట్టూ పేరుకుపోయిన చెత్త

శక్తినగర్‌లో సమస్యలు కోకొల్లలు