
సామాజిక సమస్యగా ఆత్మహత్యలు
హుబ్లీ: ప్రపంచంలో ప్రతి సెకనుకు లక్ష మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ధార్వాడ డీమ్హాన్స్ ఆస్పత్రి మాజీ డైరెక్టర్, కేసీఎం మానసిక విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ మహేష్ దేశాయి పేర్కొన్నారు. ఆయన ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా కేఎంసీ ఆస్పత్రి ఆవరణలోని 15వ మానసిక ప్రత్యేక వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్య సమితి సూచనల మేరకు ఈ ఏడాది మానసిక రోగులను చైతన్య పరిచే దిశలో ప్రతి ఏటా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మనోవ్యాధికి మందులేదన్నది పూర్వకాలం నాటి ఈ సందర్భంలోను చెప్పిన మాట అయితే ఆధునిక వైద్య శాస్త్రంలో వివిధ రకాలైన మనోవ్యాధులకు చక్కటి కౌన్సిలింగ్‌తో పాటు అత్యాధునిక ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 10 లక్షల మంది ఒక ఏడాదిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాగే 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. చాలా మంది ఇప్పటికీ మనోవ్యాధిపై మూఢ నమ్మకాలతో ఆ వ్యాధి ముదిరిపోయేలా చేసి పిచ్చిపిచ్చి అంటూ లేనిపోని అపార్థాలు, అనర్థాలతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందే కానీ తగ్గడం లేదన్నారు.
వ్యాధులపై అవగాహన అవసరం
అక్షరాస్యులు కాని నిరాక్షరాసులు కాని మనోవాధ్యులపై చక్కటి అవగాహన పెంచుకొని తమ సమీపంలోని ఆశా వర్కర్ లేదా అంగన్‌వాడి కార్యకర్త, ప్రాథమిక సముదాయ వైద్య చికిత్స కేంద్రాలతో పాటు తాలూకా ఆరోగ్య కేంద్రం, ప్రతి జిల్లా ఆస్పత్రిలోను మనోవాధ్యులకు సంబంధించిన ప్రత్యేక విభాగం 24 గంటల పాటు పని చేస్తుందని ఆయన వివరించారు. సంబంధిత సహాయవాణి ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి మనోవ్యాధితో బాధపడే వ్యక్తిని సకాలంలో మనో వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లాలని డాక్టర్ మహేష్ దేశాయి సూచించారు. సాధారణంగా మద్య వ్యసని చికిత్స అందించే సమయంలో ఫిరిటోనిన్ అనే ఔషధాన్ని ఇచ్చి ఆ వ్యసనం నుంచి క్రమేణ మనసుకు విరక్తి కలిగేలా చేస్తామన్నారు. తాను డిమ్హాన్స్ ఆస్పత్రి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో మద్య వ్యసన పరులకు చక్కగా వైద్యం అందించాక వారిలో మద్యవ్యసనం నుంచి విముక్తి పొందాక అలాంటి వారి చేతే ఎందరో మద్యవ్యసనపరులకు కౌన్సిలింగ్ చేయించి మద్యపానం వల్ల కలిగే సామాజిక, ఆర్థిక నష్టాలు, గౌరవ మర్యాదలకు భంగం ముఖ్యంగా శారీరక, మానసిక ఇబ్బందులను ఆయన వివరించారు. ఆయా విభాగాల మనోవైద్య నిపుణులు, పీజీ డాక్టర్లు, హౌస్ సర్జన్ వైద్యులతో పాటు సదరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మద్యవ్యసన పరులు, ఇతర మానసిక సమస్యల బాధితులు పాల్గొన్నారు.