
అక్రమ ఇళ్ల నిర్మాణాల్లో నకిలీ దాఖలాలు
●బాధ్యులైన ముగ్గురు అధికారుల సస్పెండ్
●లింగసూగూరు నగరసభలో అవ్యవహారం
రాయచూరు రూరల్: అక్రమంగా ఇళ్ల నిర్మాణాలకు నకిలీ రికార్డులు సృష్టించిన ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. బుధవారం లింగసూగూరు తాలూకా హులిగుడ్డ సర్వే నంబర్ 10–1–1, 10–2–1–, 10–1–13లో 9.32 సెంట్ల భూమిని ఉద్యానవనం, సీనియర్ సిటిజన్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలాన్ని నకిలీ ఖాతా, రికార్డులను సృష్టించిన వివరాలను ఆధారంగా చేసుకోని విచారణ జరిపిన జిల్లాధికారి నితీష్, నగరసభ అధికారి రవి, రెవిన్యూ శాఖ అధికారులు ఫయాజ్, అశోక్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.