లాభాల ఆశ చూపి రూ.14 లక్షల వంచన | - | Sakshi
Sakshi News home page

లాభాల ఆశ చూపి రూ.14 లక్షల వంచన

Sep 12 2025 6:47 AM | Updated on Sep 12 2025 6:47 AM

లాభాల

లాభాల ఆశ చూపి రూ.14 లక్షల వంచన

హుబ్లీ: ట్రేడింగ్‌ లాభాల ఆశ చూపి ఓ వ్యక్తి నుంచి ఆన్‌లైన్‌ కేటుగాళ్లు రూ.14 లక్షలను దోచుకున్నారు. గజేంద్రగడకు చెందిన, ప్రస్తుతం నేకార నగర నివాసి అకౌంటెంట్‌ నాగరాజ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తే లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. నాగరాజ్‌ యూట్యూబ్‌లో షేర్‌ మార్కెట్‌ గురించి పరిశీలిస్తుండగా అక్కడ దొరికిన గుర్తు తెలియని వ్యక్తి రోహన్‌కుమార్‌ మొబైల్‌కు ఫోన్‌ చేశాడు. అతడు తాను 15 ఏళ్ల నుంచి షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేస్తున్నాను. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కచ్చితంగా లాభాలు వస్తాయని నమ్మించి దశల వారీగా రూ.14 లక్షల మొత్తాన్ని తన బ్యాంక్‌ ఖాతాకు బదలాయించుకొని వంచించినట్లుగా బాధితుడు క్రైం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో గోకుల్‌ రోడ్డు వివేకానందనగర నివాసి శ్రేయస్‌కు అపరిచితుడు వాట్సాప్‌ సందేశం పంపించి వర్క్‌ ఫ్రం హోం ఆశ చూపించి లాభాలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ఆ మేరకు ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, గూగుల్‌ పే ద్వారా ఆ కేటుగాడు తన బ్యాంక్‌ ఖాతాలకు రూ.4,65,820 బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు గోకుల్‌ రోడ్డు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

రాయచూరు రూరల్‌: గ్రామాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్‌ పేర్కొన్నారు. గురువారం దేవదుర్గ తాలూకా ఖానాపూర్‌లో రహదారి, పాఠశాల, వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటు పడతామన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్యం, ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. జెడ్పీ, టీపీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్‌ మైత్రితో పోటీపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

విద్యుత్‌ తీగ తగిలి

బాలుడి చేయి కట్‌

సాక్షి,బళ్లారి: జెస్కాం అధికారులు, తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో విద్యుత్‌ తీగ తగలడంతో ఓ బాలుడు తన చేయిని పోగొట్టుకొన్న ఘటన చోటు చేసుకుంది. ఎవరో చేసిన తప్పిదానికి బాలుడి చేయి తెగిపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిపైన విద్యుత్‌ లైన్‌ ఉండటంతో బాలుడు తెలిసో తెలియకో ఇనుప రాడ్డుతో విద్యుత్‌ తీగను తగిలించడంతో విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వెంటనే చికిత్స కోసం బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే కాలిన గాయంతో బాలుడి చేయిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది.

పిడుగుపాటుకు గురై మత్స్యకారుడు మృతి

రాయచూరు రూరల్‌: తాలూకాలో బుధవారం సాయంత్రం మెరుపులతో కురిసిన వానలకు పిడుగుపాటుకు గురై ఓ మత్స్యకారుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడిని తాలూకాలోని తుంగభద్ర గ్రామానికి చెందిన దేవప్ప(40)గా పోలీసులు గుర్తించారు. నదిలో చేపలు పట్టడానికి తెప్పపై వెళ్లిన దేవప్ప పిడుగు పడి మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు యరగేరా సీఐ నింగప్ప తెలిపారు.

బార్‌ ఉద్యోగికి కత్తి పోట్లు

హుబ్లీ: బార్‌ ఎదుట మద్యం తాగి పడుకున్న వ్యక్తిని బాబు ఇక్కడ పడుకోవద్దని హితవు చెప్పిన పాపానికి బార్‌లో పని చేస్తున్న ఉద్యోగిపై కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్‌ వద్ద బార్‌ దగ్గర గోవాకు చెందిన జాన్‌ విలియం డేసి మద్యం తాగి పడుకున్నాడు. అతడిని లేపడానికి వెళ్లిన బార్‌ సిబ్బంది అజయ్‌ పాస్వాన్‌తో ఆ మందు బాబు ఘర్షణ పడ్డాడు. మాటమాటా పెరిగిన కోపంతో చాకుతో పొడిచాడు. దీంతో పాస్వాన్‌కు చిన్నపాటి గాయాలు కాగా కేఎంసీ ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రికి డీసీపీ మహనింగ నందగావి, సీఐ మహమ్మద్‌ రఫీక్‌ వెళ్లి బాధితుడిని పరామర్శించారు. హుబ్లీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో 874 గ్రాముల గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకొని గంజాయిని తరలిస్తున్న ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంటూరు రోడ్డులోని ఇంతియాజ్‌ కాలేజీ బ్యాగ్‌లో గంజాయి పెట్టుకొని విక్రయిస్తుండగా బెండిగేరి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివాహిత ఆత్మహత్య

రాయదుర్గం టౌన్‌: మండలంలోని పల్లేపల్లికి చెందిన వివాహిత చాముండి(22) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. పల్లేపల్లిలో నివాసముంటున్న నాగమ్మకు ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె చాముండికి ఏడాదిన్నర క్రితం కర్ణాటకలోని బళ్లారి జిల్లా కురుగోడుకు చెందిన చిరంజీవితో వివాహమైంది. చిన్నపాటి విషయానికి భార్యతో గొడవపడేవాడు. అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ప్రస్తుతం చాముండి నాలుగు నెలల గర్భిణి. అనారోగ్యంతో బాధపడుతున్న తన అక్కను చూసేందుకు పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. అనంతరం రెండు రోజుల క్రితం భర్త అత్తింటికి చేరుకున్నాడు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనుమానంతో ఆమెను దూషించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చాముండి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

లాభాల ఆశ చూపి  రూ.14 లక్షల వంచన1
1/2

లాభాల ఆశ చూపి రూ.14 లక్షల వంచన

లాభాల ఆశ చూపి  రూ.14 లక్షల వంచన2
2/2

లాభాల ఆశ చూపి రూ.14 లక్షల వంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement