
ఉల్లి రైతు కంట కన్నీరు
రాయచూరు రూరల్: రాష్ట్రానికే తలమానికంగా ఉన్న రాయచూరు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఉల్లిగడ్డలకు ధరలు తగ్గగా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1200 ఉండగా, మార్కెట్‌లో క్వింటాల్ ధర కేవలం రూ.500 పలుకుతోంది. గత కొన్నేళ్ల నుంచి జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొనడం, తుంగభద్ర ఎడమ కాలువలకు నీరందక పోవడం వల్ల మార్కెట్‌కు పంట దిగుబడి రావడం తగ్గింది. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, విజయ నగర, బళ్లారి, ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోటె, విజయపుర జిల్లాల్లోని రైతులు పండించిన పంటలకు ధరలు లేక తల్లడిల్లిపోతున్నారు. ఈ ఏడాది కాలువలకు నీరందక ఉల్లి పంట దిగుబడి తగ్గింది. ప్రతి నిత్యం వేలాది బస్తాలు వ్యవసాయ మార్కెట్‌కు వచ్చి పడుతున్నా ధర మాత్రం రైతులకు ఆశాజనకంగా లేదు. కొనుగోలుకు మార్కెట్‌లో బస్తాలుగా సిద్ధంగా ఉన్నాయి. రైతులు తాము పండించిన ఉల్లికి మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1200–1400 వరకు మాత్రమే ధర ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలికింది. ఏడు జిల్లాల్లో ఏటా 21 వేల హెక్టార్లలో ఉల్లిని పండించేవారు. అతిగా వర్షాలు కురవడంతో ఉల్లి పంటకు నష్టం సంభవించింది. తాజాగా విజయపురలో రైతులు ఉల్లిని రోడ్డు మీద పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఉల్లిగడ్డల బస్తాలు
రాయచూరులోని వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం
నష్టాల బారిన జిల్లాలోని అన్నదాతలు
మార్కెట్‌లో తరుగుతున్న క్వింటా ధర
దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్న రైతులు

ఉల్లి రైతు కంట కన్నీరు