
దసరా పిటిషన్‌పై తొందరేల?
● అర్జీదారులకు హైకోర్టులో నిరాశ
శివాజీనగర: మైసూరు దసరా ప్రారంభోత్సవానికి ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసరంగా విచారణకు హైకోర్టు గురువారం నిరాకరించింది. బెంగళూరుకు చెందిన పలువురు పౌరులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. హిందూ భక్తుల మనోభావాలకు భంగం కలిగించరాదన్నారు. హిందూ ప్రముఖులతోనే దసరా నవరాత్రులను ప్రారంభించాలని పేర్కొన్నారు. కోర్టు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రు, న్యాయమూర్తి సీ.ఎం.జోషిలను పిటిషనర్ తరఫు వకీలు విన్నవించారు. ఈ నెల 22న దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయని, కాబట్టి వెంటనే విచారణ జరపాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అంత అర్జంటు ఏమీ లేదని, నాలుగు రోజుల్లో విచారణకు వస్తుందని స్పష్టంచేశారు. మరోవైపు మైసూరులో దసరా ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ప్యాలెస్‌కు లైటింగ్, రంగుల పనులు జరుగుతున్నాయి.
కాబోయే జంటకు నూరేళ్లు
● బైక్‌ను ఢీకొన్న కారు, ఇద్దరూ మృతి
శివమొగ్గ: ఆలయ దర్శనం కోసం బైక్‌పై బయలుదేరిన కాబోయే భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన జిల్లాలోని శికారిపుర తాలూకాలో బుధవారం జరిగింది. అంబారగొప్ప సమీపంలోని కుట్టళ్లి క్రాస్– శిరాళకొప్ప రోడ్డులోని కిత్తూరు రాణి చెన్నమ్మ పాఠశాల వద్ద బైక్‌ను కారు ఢీకొనింది. శికారిపుర తాలూకా మట్టికోటె గ్రామ నివాసి రేఖ (22), బసవనగౌడ (24) తీవ్ర గాయాలతో మరణించారు. గత శ్రావణ మాసంలో వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో పెళ్లి ముహూర్తాన్ని నిర్ణయించారు. బుధవారం కాబోయే భార్య ఇంటికి వచ్చిన బసవనగౌడ బైక్‌లో ఆమెతో కలిసి సమీపంలోని గుడికి వెళుతున్నారు. ఈ సమయంలో మారుతీ ఎకో కారు ఢీకొనడంతో బైక్ ఎగిరి దూరంగా పడింది. తీవ్రంగా గాయపడిన జంట అక్కడే కన్నుమూసింది. పోలీసులు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
సమైక్యంగా నిమజ్జనం
శివమొగ్గ: శివమొగ్గ నగరంలోని పలు ప్రాంతాలలో వినాయక మండపాల నుంచి బుధ, గురువారం గణేశుల నిమజ్జన యాత్ర మత సమైక్యతకు చిహ్నంగా సాగింది. వందలాది మంది హిందువులతో పాటు ముస్లింలు పాల్గొని సుహృద్భావాన్ని చాటుకున్నారు. దొడ్డపేటె పరిధిలోని వినాయకుల నిమజ్జనంలో స్థానిక ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గణపతి పూలదండలు వేసి ఊరేగింపును స్వాగతించారు. తుంగా నగరలోని ఇందిరానగరలోనూ ముస్లింలు పాల్గొన్నారు.

దసరా పిటిషన్‌పై తొందరేల?

దసరా పిటిషన్‌పై తొందరేల?