
చెట్లు కూలి ట్రాఫిక్ ఇబ్బందులు
● అనేక ప్రాంతాలలో చెట్లు విరిగిపోయాయి. జన సంచారం లేకపోవడంతో ప్రాణహాని తప్పింది.
● కామాక్షిపాళ్య బస్టాండు వద్ద చెట్టు కూలిపోవడంతో సుమనహళ్లి వైపునకు వెళ్లే వాహనాల సంచారం నిలిచిపోయింది.
● అండర్‌పాసుల్లో నీరు చేరడంతో వాహనదారులు అయోమయానికి గురయ్యారు.
● రాజాజీనగర 4 వ బ్లాక్ భారీ చెట్టు కూలిపోవడంతో ఐదుకార్లు, టాటా ఏస్, నాలుగు బైకులు దెబ్బతిన్నాయి. చంద్రమ్మ, పీటర్ అనే వారి ఇళ్లకు అడ్డుగా చెట్టు పడడంతో బయటికి రాలేకపోయారు. బీబీఎంపీ సిబ్బందికి కాల్ చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ వైర్లు కూడా తెగిపోయి కరెంటు పోయి ప్రజలు నానా బాధలు పడ్డారు.
● కృష్ణరాజపురం, హెబ్బాళ, జయనగర,శాంతినగర, మెజస్టిక్ తో పాటు అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.
● గురువారం ఉదయం నుంచి రోడ్ల మీద వాననీటి వల్ల వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రామమూర్తినగర, కస్తూరి నగర, రాయసంద్ర జంక్షన్ వద్ద రోడ్లలో నీరు నిలిచిపోయింది.