
చినుకు పడితే చిత్తడే.!
రాయచూరు రూరల్: నగరంలో గురువారం భారీ వర్షం కురిిసింది. దీంతో ఎక్కడ చూసినా రహదారులు జలమయం అయ్యాయి. మున్నూరు వాడి, గాంధీ చౌక్, బసవన బావి చౌక్‌లో వర్షపు నీరు చొరబడ్డాయి. అంద్రూన్ కిల్లాలో వర్షపు నీరు ముందుకు ప్రవహించకుండా నిల్వ చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని టిప్పు సుల్తాన్ రోడ్డులోని దుకాణాలలోకి నీరు చేరాయి. ఏ వీధిలో చూసినా మురుగు కాలువల నుంచి వస్తున్న నీరు దుర్వాసన వెదజల్లింది. మోకాలి లోతున నీరు ప్రవహించాయి. మురుగు కాలువల్లో చెత్తా చెదారాలు పేరుకొని వర్షపు నీరు ముందుకెళ్లక ప్రజలను పలు ఇబ్బందులకు గురి చేశాయి. గురువారం ప్రభుత్వ పాఠశాలలకు తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ సెలవు ప్రకటించారు.
రాయచూరులో భారీ వర్షం
జలమయంగా రహదారులు

చినుకు పడితే చిత్తడే.!