
టమాటా రైతులకు పరిహారం అందించాలి
శ్రీనివాసపురం: చీడపీడలు, నకిలీ విత్తనాలతో పంట నష్టపోయిన టమాట రైతులకు ఎకరాలకు రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందించాలని రైతు సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం రైతు నారాయణగౌడ తోటలో తెగుళ్లతో నష్టపోయిన పంటను పరిశీలించారు. నాయకులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలతో రైతులు పంటలు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంచాలకుడు బంగవాది నారగరాజగౌడ, తా అధ్యక్షుడు తేర్నహళ్లి అంజినప్ప, చిక్క మునివెంకటప్ప , నాగరాజు పాల్గొన్నారు.