
హాలబావిలో ప్రబలిన డెంగీ
● 300 మందికి సోకిన వ్యాధి
● హడలెత్తుతున్న గ్రామస్తులు
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా హాలబావిలో 300 మందికి డెంగీ వ్యాధి సోకడంతో గ్రామస్తులు బెదిరి పోతున్నారు. గ్రామంలో అధికారులు, పంచాయతీ సభ్యులు స్వచ్ఛతను చేపట్టకుండా నిర్లక్ష్యం వహించడంతో వ్యాధి సోకిందన్నారు. ఆనెహొసూరు, ఈచనాళ, లింగసూగూరు సర్కారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 20 రోజుల క్రితం తాలూకా స్థాయి అధికారులు గ్రామాన్ని సందర్శించి పీడీఓలకు, సభ్యులకు అదేశాలు జారీ చేశారు. గ్రామంలో పారిశుధ్యం, మురుగు కాలువల స్వచ్ఛత, వీధుల పరిశుభ్రతను చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి అధికారుల నిర్లక్ష్యమే డెంగీ వ్యాధి సోకడానికి కారణమైంది. గ్రామానికి అంబులెన్సు సౌకర్యం లేకపోవడం, గ్రామానికి కి.మీ.దూరం ప్రధాన రహదారి ఉండడం తాలూకా ఆరోగ్య అధికారి స్పందించక పోవడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు. లింగసూగూరు తహసీల్దార్ సత్యమ్మ హుటాహుటిన హాలబావిలో పర్యటించి ప్రజలకు సత్వర సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆత్మహత్యల నియంత్రణ
అందరి బాధ్యత
రాయచూరు రూరల్: ఆత్మహత్యల నివారణ మనందరి కర్తవ్యమని రాయచూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ పిలుపు ఇచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతాను ప్రారంభించి ఆయన మాట్లాడారు. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడకుండా వారిలో చైతన్యం కల్పించాలన్నారు. నిత్య జీవితంలో పలు విధాలుగా మానవుడు కష్టాల పాలై ఆత్మహత్యకు సిద్ధపడకుండా నివారణకు ముందుండాలన్నారు. జాతాలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సురేంద్రబాబు, గణేష్, షాకీర్, మనో వైద్య విభాగాధికారిణి యశోధ, మనోహర్ పత్తార్, సరోజలున్నారు.
సైబర్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త
రాయచూరు రూరల్: ప్రజలు సైబర్ నేరాలు, వంచనల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని రిటైర్డ్ డీఎస్పీ శ్రీధర్ దొడ్డి అన్నారు. బుధవారం నగరంలోని ప్రైవేట్ హోటల్‌లో సైబర్ నేరాల నియంత్రణపై ప్రజలకు, యువకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో రోజుకు 7 వేల సైబర్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు 700 కేంద్రాల్లో సైబర్ నేరాల నియంత్రణపై ప్రచారాన్ని రాయచూరు నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులతో సహకరిస్తే సైబర్ నేరాలను అరికట్టవచ్చన్నారు. ప్రజలకు బజాజ్ ఫైనాన్స్ బ్యాంకు అధికారులు, పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, బజాజ్ ఫైనాన్స్ బ్యాంకు అధికారులు వెంకటేష్, రేవణ్ణ హెగ్డేలున్నారు.
చాకుతో పొడిచిన ఇద్దరు అరెస్ట్
హుబ్లీ: వ్యక్తిగత కక్షతో ఓ వ్యక్తిని చాకుతో పొడిచిన కేసులో ఇద్దరు నిందితులను అశోక్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. దేవాంగ పేట చమన్‌సాబ్, యూనుస్ నాయక్ వ్యక్తిగత కక్షతో భీమరాజ్‌పై దేవాంగపేటలో చాకుతో దాడి చేశారు. అలాగే డివైడర్ ఢీకొన్న ఫలితంగా గాయపడి కేఎస్‌ఆర్‌పీ పోలీస్ సిబ్బంది చికిత్స ఫలించక మంగళవారం మృతి చెందారు. కమలాపుర నివాసి దినేష్ వాడ్కర్ మృతుడు. 10 రోజుల క్రితం జేఎస్‌ఎస్ కళాశాల వద్ద రోడ్డులో డివైడర్‌కు తన బైక్‌ను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన చికిత్స ఫలించక మృతి చెందినట్లు ధార్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
గంజాయి విక్రేత అరెస్టు
గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తి స్థానిక కేశ్వాపుర సుళ్య రోడ్డు హోటల్ సమీపంలో కేశ్వాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. గణేష్ పేట నివాసి సునీల్ బళ్లారి 250 గ్రాముల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేశ్వాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో యువకుడిని కిడ్నాప్ చేసి దాడి చేసినట్లుగా కేసు నమోదైంది. ప్రియురాలితో వెళుతున్న యువకుడిని ముగ్గురు, నలుగురితో ఉన్న ఆటోలో కిడ్నాప్ చేసి కార్వాడ రోడ్డు ఏసిగిమడ్డి వద్ద బయలు ప్రదేశానికి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. యువతి ఆమె ఊరిలో వదలిపెట్టాలని తీసుకెళుతున్న క్రమంలో మలికా జాన్, పత్తేష్ తదితర మరో ఇద్దరు కలిసి నువ్వు ప్రేమించేదానికి వేరెవారు దొరకలేదా? అని బాగా కొట్టి కత్తి చూపించి తనను చంపేస్తామని బెదిరించారని బాధితుడు మణికంఠ పాత హుబ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాధితుడిని కేఎంసీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హాలబావిలో ప్రబలిన డెంగీ

హాలబావిలో ప్రబలిన డెంగీ