
ఒపెక్ ఆస్పత్రిలో న్యాయమూర్తి తనిఖీ
రోగులతో మాట్లాడుతున్న జడ్జి స్వాతిక్
ప్రత్యేక అధికారి రమేష్ సాగర్‌తో జడ్జి స్వాతిక్
రాయచూరు రూరల్: ఒపెక్ ఆస్పత్రిని రాయచూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్వాతిక్ సందర్శించారు. బుధవారం ఒపెక్ ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలించి రోగుల నుంచి వివరాలు సేకరించారు. వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? అనే అంశాలపై సుదీర్ఘంగా వారితో మాట్లాడారు. మరో వైపు శిక్షణ పొందుతున్న వైద్యులను పిలిచి రోగులకు ఎలా చికిత్స చేస్తున్నారో ఆరా తీశారు. ఒపెక్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి రమేష్ సాగర్‌ను పిలిచి వివిధ విభాగాల్లో రోగులకు సమానంగా చికిత్స జరిగేలా చూడాలని సూచించారు.

ఒపెక్ ఆస్పత్రిలో న్యాయమూర్తి తనిఖీ