
టెలిమానస్‌తో ఒత్తిడి నివారణ
రాయచూరు రూరల్: నేటి సమాజంలో పనుల ఒత్తిడి వల్ల మానసికంగా ధైర్యాన్ని కోల్పోతున్నట్లు, దీని వల్ల కొంత మంది అత్మహత్యలు చేసుకున్న అంశాలను గురించి మానసిక ఆరోగ్య పథకం సంచాలకుడు సంతోష్ కుమార్ పేర్కొన్నారు. హరిహరలోని సీ్త్రశక్తి భవనంలో ప్రపంచ ఆత్మహ్యతల నివారణ దినోత్సవాలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు టెలిమాసన్ మానసిక ఆరోగ్య విద్య శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి 40 సెకెండ్లకు ఓకరు అత్మహత్య చేసుకుంటున్నారన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలన్నారు. బాల్య వివాహాల నియంత్రణ, బాల కార్మిక పద్ధతి వంటి వాటికి స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో ప్రియా, ఇతరులు పాల్గొన్నారు.