
పైన పటారం.. లోన లొటారం
అద్దాలు ధ్వంసం కావడంతో కిటికీకి అట్టలే గతి
పగిలిన స్విచ్ బోర్డుకు మరమ్మతు చేయని దృశ్యం
డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ బాలుర హాస్టల్
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలు ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వలస వస్తే విద్య అలవడుతుందని భావించి హాస్టల్‌లో ఉండి చదువుకొనే విద్యార్థులు అసౌకర్యాల మధ్య వెలుతురు లేకుండా చిరిగిన గోనె సంచులతో కిటికీలకు తెరలు కట్టుకున్న ఘటన నగరంలో వెలుగు చూసింది. తాగునీటి సౌకర్యం కల్పించకుండా ఉన్నారు. బిజినగేర రహదారిలోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ హాస్టల్‌లో ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే 154 మంది విద్యార్థులకు 54 గదులు కేటాయించారు. హాస్టల్ వార్డెన్ మహబూబ్ తనకేమీ సంబంధం లేని విధంగా ఉంటున్నారు. అటవీ ప్రాంతంలో కొండపై హాస్టల్ ఉంది. రాత్రి పూట విద్యుత్ కోత విధిస్తే జనరేటర్‌ను ఉపయోగించడం లేదని విద్యార్థులు వాపోయారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రం చేయకుండా అలాగే ఉంచారు. సోలార్ విద్యుత్ ఉన్నా ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా ఉంచారు. విద్యుత్ పరికరాలకు సంబంధించి వైర్లు బయటకొచ్చినా వాటికి మరమ్మతు పనులు చేపట్టకుండా వదిలి వేయడంతో ఏ సమయంలో విద్యుత్ వైర్లు షాక్ కొడతాయో అనే భయం విద్యార్థుల్లో నెలకొంది. గదులకు సరైన తలుపులు లేవు. విద్యుత్ బల్పులు అమర్చకుండా, ఫాన్లు వేయకుండా వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అస్తవ్యస్తంగా అంబేడ్కర్ బాలుర హాస్టల్
విద్యార్థులకు కనీస సౌకర్యాలు
కరువైన వైనం

పైన పటారం.. లోన లొటారం

పైన పటారం.. లోన లొటారం

పైన పటారం.. లోన లొటారం